రష్మిక... ఇప్పుడు టాలీవుడ్ జనాలను ఊపేస్తున్న పేరు ఇది. అగ్ర హీరోయిన్ గా చాలా తక్కువ కాలంలో మారిపోయిన హీరోయిన్. అగ్ర హీరోయిన్ గా ఇప్పుడు సినిమాలు చేస్తూ తన మార్క్ ని తెలుగు సినిమా మీద వేసిన హీరోయిన్. ఇక ఇప్పుడు ఆమె డిమాండ్ ఏ రేంజ్ లో ఉంది అంటే ఆమె డేట్స్ కోసం ఎదురు చూసే విధంగా ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా సరే ఆమెను సినిమాలోకి తీసుకునే విధంగా ఆమె డిమాండ్ ఉంది అనేది వాస్తవం. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. దీనికి కారణం ఆమె అందం... ఆమె గ్లామర్ విషయంలో చూపించే సమయంలో ఏ లోటు కూడా ఇవ్వదు అని అంటారు. పాత్రలో దర్శకుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా కనపడటానికి ఆమె ఆసక్తి చూపిస్తుంది అని అంటారు. అందుకే ఆమె తో సినిమాలు చేయడానికి చాలా మంది అగ్ర హీరోలు పోటీ పడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు. ఆమె ఇప్పుడు రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు అన్నీ కూడా స్టార్ హీరోలతో చేస్తున్న సినిమాలే కావడం విశేషం. 

 

ఇప్పుడు ఆమె ఒక సినిమాలో కీలక రోల్ లో సోలో గా చేస్తుంది అని అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చెప్పడం ప్రస్తుతం కాస్త కష్టమే. కెరీర్ మొదట్లో కాస్త డీసెంట్ గా కనపడినా ఇప్పుడు మాత్రం అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది ఆమె. అందుకే అగ్ర దర్శకులు కాస్త రేటు ఎక్కువ అయినా సరే ఆమెను సినిమాలోకి తీసుకోవడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: