పలాస 1978 సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా కరుణ కుమార్, ఒక్క సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ డైరక్టర్ ఏకంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ దగ్గర నుండి ఆఫర్ రాబట్టుకున్నాడు. అయితే కరుణ కుమార్ తన సెకండ్ మూవీ అల్లు అరవింద్ నిర్మాణంలో చేయట్లేదని తెలుస్తుంది. టాలెంట్ ఉన్న వారిని వెంటనే వెతికి పట్టుకునే యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ తో కరుణ కుమార్ సెకండ్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. 

 

రాజశేఖర్ లోని ఇంటెన్స్ ను కరెక్ట్ గా వాడితే ఎలాంటి అద్భుతమైన సినిమాలు వస్తాయో ఇదివరకు మనకు తెలిసిందే. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ సెట్ అయ్యిందని చెప్పొచ్చు. అసలు ఎలాంటి పరిచయంలేని వ్యక్తులతో పలాస 1978 సినిమా తీసి హిట్టు కొట్టిన డైరక్టర్ కరుణ కుమార్ రాజశేఖర్ తో సినిమా చేస్తే ఆ రచ్చ వేరేలా ఉంటుంది. ఎవడైతే నాకెంటి సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ గరుడవేగతో హిట్టు కొట్టాడు రాజశేఖర్. ఆ తర్వాత కల్కి పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. 

 

అందుకే కరుణ కుమార్ తో ఈసారి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో.. హిట్టు టార్గెట్ తో వస్తున్నాడట రాజశేఖర్. పలాస సినిమా చూసిన వారికి కరుణ కుమార్ టాలెంట్ ఏంటో బాగా అర్ధమవుతుంది. మరి అలాంటి డైరక్టర్ తో రాజశేఖర్ సినిమా అంటే అంచనాలు భారీగా ఏర్పడుతాయి. ఆ అంచనాలకు తగినట్టుగా సినిమా వస్తే మాత్రం రాజశేఖర్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉంటుంది. అయితే కరుణ కుమార్, రాజశేఖర్ కోసం ఏ జానర్ సినిమా చేస్తున్నాడు.. యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఎలా వాడుతారు అన్నది మాత్రం సినిమా ఎఔన్స్ చేసి సెట్స్ మీదకు వెళ్ళాక తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: