కొత్తగా ఏదైనా చేయాలంటే అది ఆర్జీవీ తర్వాతే ఎవరైనా అది అప్పట్లో తీసిన శివ సినిమాతోనే ప్రూవ్ అయినా ఇప్పటికి వర్మ కొత్త ప్రయత్నాలు.. ప్రయోగాలతో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. అందరు లాక్ డౌన్ లో బి ద రియల్ మెన్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఇళ్లల్లో పనులు చేస్తుంటే తాను మాత్రం సినిమా తీసేశాడు. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంటె వర్మ ఎలా సినిమా ఎలా తీశాడు అన్న డౌట్ కూడా అందరికి వచ్చింది. ఇదిలాఉంటే లేటెస్ట్ గా క్లైమాక్స్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను సర్ ప్రయిజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు వర్మ. మియా మాల్కోవా అందాలను ఎరగా వేస్తూ క్లైమాక్స్ అనే సినిమా చేశాడు ఆర్జీవీ. 

 

ఈ సినిమాను ఓటిటి రిలీజ్ చేస్తాడని అనుకున్న వర్మ అందరికి షాక్ ఇస్తూ కొత్తగా పే పర్ వ్యూ రిలీజ్ అనేశాడు. ఓటిటి అంటే ఓవర్ ది టాప్ అంటే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా లాంటివి.. ఒకసారి సబ్ స్క్రైబ్ చేసి నెల వారినో.. సంవత్సరానికో పేమెంట్ కట్టేస్తే.. అందులో రిలీజ్ చేసే సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. అయితే వర్మ ప్రవేశ పెట్టిన అలా కాకుండా.. శ్రేయాస్ ఈటి యాప్ ద్వారా క్లైమాక్స్ సినిమా రిలీజ్ చేశారు. సినిమా చూడాలని అనుకునే వారు డైరెక్ట్ గా యాప్ డౌన్ లోడ్ చేసుకుని 100 రూపాయలు పే చేసి సినిమా చూడొచ్చన్నమాట. దీన్ని వెరైటీ ఏటిటి అంటున్నారు కొందరు అంటే ఎనీ టైం థియేటర్ అన్నమాట. అంటే వర్మ ఉద్దేశ్యం ఎప్పుడు సినిమా చూడాలని అనిపిస్తే అప్పుడు 100 రూపాయలు పే చేసి సినిమా చూడొచ్చు. ఇక్కడ మెలిక ఏంటంటే ఒక్కసారి మొదలు పెట్టిన సినిమా పూర్తిదాకా చూడాల్సిందే. 

 

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు చూసే అవకాశం లేదు. మియా మాల్కోవా అందాలనే పెట్టుబడిగా పెట్టి క్లైమాక్స్ సినిమా తీసిన ఆర్జీవీ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని  చూస్తున్నాడు.    
   

మరింత సమాచారం తెలుసుకోండి: