జూన్ 10 వ తారీకు నందమూరి బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఫుల్ హడావిడి చేయటానికి రెడీగా ఉన్నారు. రాబోయే బర్తడే షష్టిపూర్తి కావడంతో ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేయటానికి నందమూరి కుటుంబ సభ్యులు కూడా రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా మొదట అభిమానుల సమక్షంలో బాలయ్య పుట్టినరోజు వేడుకలు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వేడుకకు నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు అని ఫిలిం నగర్ టాక్.

IHG

నందమూరి కుటుంబ సభ్యులు కూడా భారీ ఎత్తున బాలయ్య జన్మదిన వేడుకలు చేయబోతున్నరట. ఈ తరుణంలో నందమూరి కుటుంబ సభ్యులకు భారీ విందు ఏర్పాట్లు జరుగుతున్నట్లు, ఈ విందులో టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్న బోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆరోజు హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఒకవైపు టెన్షన్ వాతావరణం మరొకవైపు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో నెలకొంది.

IHG's the Difference Between <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BALAKRISHNA' target='_blank' title='balakrishna-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>balakrishna</a> & Chiranjeevi

ఎందుకంటే ఇటీవల చిత్ర పరిశ్రమ తరపున తెలంగాణ ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలిసిన టైం లో తనకు పిలుపు ఇవ్వలేదని బాలయ్య బాబు సంచలన వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. బాలయ్య వ్యాఖ్యలు అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ వివాదాస్పదమయ్యాయి. ఇలాంటి సమయంలో బాలయ్య బర్త్ డే వేడుకలకు చిరంజీవి హాజరు కాబోతున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ సందర్భంలో బాలయ్యే స్వయంగా చిరంజీవి ని తన బర్త్డే వేడుకలకు ఆహ్వానించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా చిరంజీవి బాలయ్య ఆహ్వానం మేరకు వేడుకలకు హాజరైతే సినిమా ఇండస్ట్రీ పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లు ఉంటుందని ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: