రంభ‌.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 90ల్లో తెలుగు తెర‌ను షేక్ చేసిన హీరోయిన్లలో రంభ పేరు ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. టాలీవుడ్‌లోనే కాకుండా అటు బాలీవుడ్, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రంభ. అమాయకపు మొహంతో, డైలాగ్ లతో, నటనతో, నాట్యంతో వయ్యారాలు వలకపొసిన రంభ‌కు అప్ప‌ట్లో భారీ ఫ్యాన్ ఫాలోంగ్ ఉండేది. 

ఇక‌ స్టార్ హీరోలందరి సరసనా హీరోయిన్ గా నటించిన రంభ.. తెలుగు సినిమాల్లో ఎక్స్ పోజింగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింద‌ని చెప్పాలి. అప్పట్లోనే రంభ గ్లామర్ కు కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయారు. అయితే హీరోయిన్ గా జోరు తగ్గిపోయాక కూడా కొన్నాళ్లు సినీ రంగాన్నే అంటిపెట్టుకుని ఉన్న రంభ.. 2010లో ఇంద్రన్ పద్మనాభన్ అనే తమిళ వ్యాపారవేత్తను పెళ్లాడి కెనడాలో సెటిలైపోయింది. ఈ దంప‌తుల‌కి ముగ్గురు సంతానం.

కానీ, 2016లో తన భర్త నుండి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసును పరిశీలించిన కోర్టు ఇద్దరూ కలిసి ఓ అవగాహనకు రావాలంటూ సూచన చేయడం, మ‌రోవైపు పెద్ద‌లు జోక్యంతో ఇప్పుడు ఆ‌ ఇద్ద‌రు క‌లిసి కొత్త జీవితం గ‌డుపుతున్నారు. ఇక  త‌న ఫ్యామిలీతో క‌లిసి హ్యాపీగా గ‌డుపుతున్న రంభ జూన్ 5న త‌న 44వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంది. 

ఇందుకు సంబంధించిన ఫోటోల‌ని రంభ తాజాగా అభిమానుల‌తో పంచుకుంది.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకకు ఎవరినీ ఆహ్వానించకుండా ఆమె తన కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక చేసుకుంది. తన పిల్లలు, భర్తతో సంతోషంగా గడిపానని చెప్పింది. ఇక నిజానికి పెళ్ళై ముగ్గురు పిల్లలున్నప్పటికీ రంభ గ్లామర్ తగ్గలేద‌నే చెప్పాలి. 44 ఏళ్ల రంభ అవే అందాల‌తో ఆక‌ర్షిస్తోంది. మ‌రి ఆ ఫోటోల‌పై మీరు ఓ లుక్కేసేయండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#cherishingeverymoment #familylove #birthday #june5

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

మరింత సమాచారం తెలుసుకోండి: