టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ మూవీస్ లో అక్కినేని మల్టీస్టారర్ మనం ఒకటి. మల్టీస్టారర్ సినిమా తీస్తే మనం అనిపించేలా చేసిన సినిమా అది. విక్రమ్ కె కుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని మూడు తరాల హీరోలు నటించారు. అంతేకాదు ఏయన్నార్ నటించిన చివరి సినిమాగా కూడా మనం ఎప్పటికి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. ఏయన్నార్, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించగా చివర్లో అఖిల్ కూడా సర్ ప్రయిజ్ ఎంట్రీ ఇస్తాడు. సినీ నేపథ్యం ఉన్న హీరోలు కూడా తీస్తే మనం లాంటి మల్టీస్టారర్ తీయాలని అనిపించేలా ఉన్న సినిమా అది. 

 

సినిమా కథ కూడా విక్రమ్ కుమార్ కేవలం అక్కినేని ఫ్యామిలీ కోసం రాసినట్టుగా ఉంటుంది. అందుకే ఈ సినిమా రీమేక్ కోసం ఎంత పెద్ద మొత్తంలో ఆఫర్స్ వచ్చినా నాగార్జున ఇవ్వలేదు. ఈ సినిమా నిర్మించింది కూడా అన్నపూర్ణ బ్యానర్ లోనే.. అందుకే నాగార్జున మనం నాగేశ్వరారావు గారు జ్ఞాపకంగా ఉంచుకున్నారు. ఇప్పటికి మిగతా సినీ ఫ్యామిలీస్ అన్ని మనం లాంటి మంచి కథ దొరికితే బాగుంటుంది అనుకునేలా చేసిన సినిమా అది. ఈ సినిమాకు కథ, కథనాలే కాదు మిగతా నటీనటులతో పాటుగా మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. 

 

అనూప్ రూబెన్స్ కెరియర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన సినిమా అది. మెలోడీ సాంగ్స్ తో మనం సినిమాకు మ్యూజిక్ కూడా ఒక హైలెట్ అనిపించేలా చేశాడు. టాలీవుడ్ క్లాసిక్ మూవీస్ లో మనం కూడా నిలుస్తుంది. మనం సినిమా చూసి మిగతా సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీస్ మల్టీస్టారర్స్ ప్రయత్నించినా సరైన కథ దొరకడం లేదు. మనం తర్వాత ఆ సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా ఆ రేంజ్ హిట్ అందుకోలేదని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: