తండ్రికి తగ్గ తనయుడు అని కొందరిని మాత్రమే చెబుతారు. తండ్రి చూపిన బాటలో తూచా తప్పకుండా వెళ్తూ అమ్మ, నాన్న, గురువు, దైవం అన్ని తన తండ్రే అనేంతగా ప్రేమ చూపుతాడు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ నట వారసుడిగా ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల బీభత్ససం సృష్టించాయి. తాతమ్మ కల సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన బాలకృష్ణ సినీ జీవితం.. హీరోగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేస్తూ వచ్చాడు.  

 

105 సినిమాల సినీ కెరియర్ లో పౌరాణికం, పిరియాడికల్, సోషల్ సినిమాలతో నందమూరి నట వారసుడు అనిపించుకున్నాడు బాలకృష్ణ. డైలాగ్ చెప్పాలంటే బాలయ్య తర్వాతే.. వీర రసం చూపించాలంటే బాలకృష్ణ తర్వాతే ఎవరైనా.. ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని విభాగాల్లో బాలయ్య ది బెస్ట్ అనిపించేలా చేస్తాడు. దాదాపుగా 45 ఏళ్ల సినీ కెరియర్ లో నందమూరి నట వారసత్వాన్ని తన భుజాన మోశాడు బాలయ్య బాబు. ఎన్టీఆర్ తర్వాత నందమూరి నట ప్రస్థానం కొనసాగించిన బాలకృష్ణ జెనరేషన్స్ మారినా తనలా డైలాగ్ చెప్పడం ఎవరి వల్లా కాదని ప్రూవ్ చేస్తూ వచ్చాడు. కేవలం సినిమా హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా బాలకృష్ణ, అక్కడ కూడా నమ్ముకున్న ప్రజలకు అన్నివిధాలుగా తన సహకారాన్ని అందిస్తున్నారు. 

 

60 ఏళ్ళు వచ్చినా బాలకృష్ణ ఎక్కడ ఉన్నా ఆ ఎనర్జీని వేరు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నాలుగు స్తంభాలుగా చెప్పుకునే చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలతో పాటుగా బాలకృష్ణ కూడా ఒకరు. తాతమ్మ కల టూ రూలర్ వరకు నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కిన బాలయ్య బాబు ఇలానే మరి కొన్నాళ్ళు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.      

 

మరింత సమాచారం తెలుసుకోండి: