మన తెలుగులో ఏ హీరో అయినా సరే కథ బాగుంది అంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. కథ బాగా లేకపోయినా సరే హీరో నటన సినిమాలో బాగుంది అంటే మాత్రం ఏ విధంగా అయినా సరే సినిమాను కచ్చితంగా ఆదరించే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సినిమాలు ఏది అయినా సరే సూపర్ హిట్ అవుతాయి అనే మాట వాస్తవం. ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన కొన్ని కొన్ని సినిమాలు ఆ విధంగానే హిట్ అయ్యాయి అనేది వాస్తవం. అతని కెరీర్ లో పూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం టెంపర్. 

 

అప్పటి వరకు ఒక స్టార్ హీరో అలాంటి సినిమా చేయవచ్చు అనే విషయం చాలా మంది దర్శకులకు గాని హీరోలకు గాని నిర్మాతలకు గాని ఆలోచన కూడా వచ్చి ఉండదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఆ విధంగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఉండే ప్రతీ సీన్ లో కూడా ఎన్టీఆర్ జీవించాడు అనేది వాస్తవం. ఏ సన్నివేశం అయినా సరే ప్రేక్షకులు సినిమా చూసి వచ్చి అతని నటన గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు అనే విధంగా ఈ సినిమా ఉంది అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాతః చాలా మంది హీరోలు అదే విధంగా ట్రై చెయ్యాలి అని చూసారు. 

 

కాని ఎన్టీఆర్ రేంజ్ లో ఎవరు కూడా విజయవంతం కాలేదు. బాలయ్య కూడా అదే పూరి దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేసినా సరే అది హిట్ అవ్వలేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: