మనం... అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అతి పెద్ద హిట్ ఈ సినిమా. ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ అందరూ కూడా కనిపించారు. ఇక ఈ సినిమా అక్కినేని కెరీర్ లోనే చివరి సినిమా. ఈ సినిమా తర్వాతే ఆయన కన్ను మూశారు కూడా. ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది కూడా. ఈ సినిమాలో మొత్తం నటులు అందరూ కూడా తమ స్థాయికి మించి నటించారు అనే చెప్పవచ్చు. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించింది అని చెప్పాలి. అక్కడ కూడా డబ్బింగ్ గా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు అనేది వాస్తవం.

 

ఈ సినిమాలో ఉన్న కథ తో పాటుగా సినిమాను తీసిన విధానం హైలెట్ అయింది. అప్పటి వరకు ఒక ఫ్యామిలీ మొత్తం సినిమాను చేయవచ్చు అనే విధంగా ఆలోచన ఎవరికి రాలేదు అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత అలాంటి ప్రయోగాలు చెయ్యాలి అని కొందరు చూసినా సరే అంతగా హిట్ అవ్వలేదు అనే చెప్పాలి. ఈ సినిమాలో నాగార్జున నటన అక్కినేని నాగ చైతన్య నటన నుంచి సమంత నటన వరకు అన్నీ కూడా హైలెట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రతీ సీన్ కూడా చాలా బాగా నచ్చింది ప్రేక్షకులకు అనేది వాస్తవం. 

 

సినిమా తర్వాత స్టార్ హీరోల కుటుంబాలు సినిమాలు చెయ్యాలి అని చూసినా సరే అంతగా వాళ్ళు హిట్ అవ్వలేదు అనే చెప్పాలి. కాగా ఈ సినిమాకు చాలా చాలా అవార్డులు కూడా వచ్చాయి. అక్కినేని చివరి సినిమా కావడంతో దాదాపు అందరూ కూడా ఈ సినిమాను కచ్చితంగా చూసారు అనే చెప్పాలి. ఇప్పటికి ఈ సినిమా టీవీ లో వచ్చినా సరే అందరూ చూసే పరిస్థితి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: