వెంకటేష్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఘర్షణ సినిమా కూడా ఒకటి. తమిళ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ నటన ఒక హైలెట్ అయితే సినిమా కథ ఈ సినిమాను దర్శకుడు ప్రేక్షకులకు అందించిన విధానం ఒక హైలెట్. అసలు పోలీసులు ఆ విధంగా ఒక ఆపరేషన్ చేస్తారు అనే విధంగా  ఎవరికి ఆలోచన కూడా అప్పటి వరకు రాలేదు. ఒక నేరస్తుడని టార్గెట్ చేయడానికి పోలీసులు ఆ విధంగా వర్క్ చేస్తారు వారు ఆ విధంగా నష్టపోతారు పోలీసుల బాధలు ఏ విధంగా ఉంటాయి అనే విధంగా ఈ సినిమా ప్రూవ్ చేసింది అని చెప్పవచ్చు. 

 

ఈ సినిమాలో ముఖ్యంగా ముంబై లో తీసిన కొన్ని సన్నివేశాలు అయితే సూపర్ గా ఉన్నాయి అంటూ చాలా మంది అప్పుడు కామెంట్ కూడా చేసారు. ఈ సినిమాలో హీరో నటన ఒకటే కాదు హీరోయిన్ నటన కూడా ఒక హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆసిన్ నటించింది. ఆమె ఈ సినిమాలో జీవించింది అనే చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా ఒక ట్రెండ్ సృష్టించింది అనేది వాస్తవం. దర్శక నిర్మాతలు చాలా మంది ఇలాంటి ప్రయోగాలు చేయడానికి అప్పుడు ఒకరకంగా భయపడ్డారు. అయినా సరే అలాంటి సినిమాలను చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు. 

 

అయితే సినిమా ఆశించిన స్థాయిలో విజయం మాత్రం సాధించలేదు. దీనితో హీరోలు కూడా ఇలాంటి సినిమాలు చేస్తే కష్టం అని భావించి ఇలాంటి సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రతీ సీన్ కూడా చాలా బాగా నచ్చింది ప్రేక్షకులకు అనేది వాస్తవం. ఈ సినిమా ఇపుడు టీవీ లో వచ్చినా సరే చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: