టాలీవుడ్ లోనే కాదు తమిళంలో కూడా ఒక ఊపు ఊపిన సినిమా దేవత. ఈ సినిమాలో ఉన్న కథ ఒక హైలెట్ అయితే దర్శకుడు కొన్ని కొన్ని సన్నివేశాలను తీసిన విధానం ఒక హైలెట్. ఇక ఈ సినిమా టాలీవుడ్ లోనే కాదు అటు తమిళ సినిమాలో కూడా ఒక సంచలనం అని చెప్పవచ్చు. సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోయిన్ లు ఒక స్టార్ హీరో ని ప్రేమిస్తూ సినిమాను తీయడం అనేది అప్పటి వరకు ఎవరూ కూడా సాహసం చేయలేదు అనే చెప్పాలి కాని ఈ సినిమాలో ఆ సన్నివేశాలు ప్రేక్షకులను షాక్ కి గురి చేసాయి అనేది వాస్తవం. 

 

సాధారణంగా అలాంటి ప్రయోగాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎవరూ కూడా ముందుకు రారు. కాని ఈ సినిమా దర్శకుడు రాఘవేంద్ర రావు మాత్రం ఈ సినిమాను చేసి ఒక సంచలనం సృష్టించారు అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా హైలెట్. శ్రీదేవి జయప్రద నటన కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. ఆ ఇద్దరు కూడా ఈ సినిమాలో నటించారు అనడం కంటే జీవించారు అనడమే బాగుంటుంది. ఆ విధంగా ఇద్దరూ కూడా ఒక ఊపు ఊపారు ఈ సినిమాలో. ఇక కథ ఒక హైలెట్ అయితే హీరో శోభన్ బాబు నటన కూడా ఒక హైలెట్ అని చెప్పవచ్చు. 

 

అప్పటి వరకు ఆయన ఆ విధంగా సినిమాలు చేయలేదు. టాలీవుడ్ లో కూడా ఏ హీరో కూడా ఆ విధంగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. కాని కథలో పట్టు ఉన్న నేపధ్యంలో హీరో కథలో జీవించారు అని చెప్పవచ్చు. ఈ సినిమా టాలీవుడ్ లో అనేక సంచలనాలు సృష్టించింది అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: