తెలుగు ప్రేక్షకులకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉండదు అన్న విషయం. ఎప్పుడూ ఏదో ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు ఎంతో మంది యువ హీరోలు ఇంకెంతో మంది సీనియర్ హీరోలు కూడా ఉన్నారు. వీరికి  సంబంధించిన ఏదో ఒక సినిమా సందడి చేస్తూనే ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే సినిమాలు వస్తుంటాయి. కొన్ని విజయాలు సాధిస్తే మరికొన్ని ప్రేక్షకాదరణ పొందలేవు. కానీ కొన్ని సినిమాలు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తూ  ఉంటాయి. హీరో కెరీర్ ను మలుపు తిప్పుతూ  ఉంటాయి. ఇలా అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏది అంటే ఆర్య  అని చెప్పాలి. 

 


 అల్లు వారి వారసుడిగా మెగా మేనల్లుడి గా గంగోత్రి సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. అవి మంచి విజయాలు కూడా సాధించాయి కానీ  అల్లు అర్జున్ ను  స్టార్ హీరో రేంజ్ కు మాత్రం తీసుకెళ్లలేకపోయాయి . కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ కెరీర్ని కీలక మలుపు తిప్పిన సినిమా మాత్రం ఆర్య అని చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా మంచి విజయాన్ని కూడా సాధించింది. 

 


 ఇక అప్పటి వరకు సాదాసీదా హీరోగా ఉన్న అల్లు అర్జున్ ని స్టార్ హీరో రేస్  లోకి నెట్టింది ఈ సినిమా. ఒక అబ్బాయిని  ప్రేమిస్తున్న అమ్మాయి ని హీరో లవ్ చేస్తాడు . ఇక ఈ ముగ్గురి మధ్య సంభాషణలు ఎలా ఉంటాయి అల్లు అర్జున్  కామెడీ టైమింగ్ తో.. నటనతో ఎలా ఆకట్టుకుంటాడు అనేది సినిమా మొత్తం ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఇక సుకుమార్ అంటే కాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అలాంటి కాలిక్యులేషన్స్ కాస్త తక్కువగానే కనిపించినప్పటికీ... ఈ సినిమాలోని లవ్ స్టోరీ మాత్రం ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయి పోయింది. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన స్టార్ హీరోని చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: