తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్న అందరికీ అప్పట్లో ఒక సినిమా ద్వారా బ్రేక్ వచ్చి ఆ తర్వాత హీరోగా ఎదిగిన విషయం తెలుసిందే . ముఖ్యంగా అప్పట్లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దర్శకుడు బి.గోపాల్. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం మాస్ సినిమాల మేనియా నడుస్తున్న సమయంలో బి గోపాల్ ఒక రేంజ్ లో హవా నడిపించారు అనే చెప్పాలి. ఎంతో మంది హీరోలతో మాస్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేశారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి దర్శకుడు బి.గోపాల్ బాలకృష్ణతో తెరకెక్కించిన సినిమా బాలకృష్ణ కెరీర్ను కీలక మలుపు తిప్పింది. ఆ సినిమానే నరసింహనాయుడు. అప్పట్లో మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఎంత ఉర్రూతలూగించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 

 బాలకృష్ణ కెరీర్ ని కీలక మలుపు తిప్పి కొత్త ట్రెండ్ సృష్టించింది నరసింహనాయుడు సినిమా. ఫ్యాక్షన్ సినిమాకు మారుపేరుగా... యాక్షన్ సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ గా... మారిపోయింది నరసింహనాయుడు సినిమా. ఈ సినిమాలో ఫ్యాక్షనిస్టు గా నటించిన బాలయ్య పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది అని చెప్పాలి. ఈ సినిమా బాలయ్య కు మాస్ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. నరసింహ నాయుడు పాత్రలో బాలకృష్ణ చేసే యాక్షన్ సన్నివేశాలు నాటి ప్రేక్షకులందరినీ అబ్బురపరిచాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

 


 ఇక నరసింహనాయుడు సినిమా కేవలం బాలకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పడమే  కాదు అటు దర్శకుడు బి  గోపాల్ కి కూడా కూడా ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత బి.గోపాల్  దర్శకత్వంలో బాలకృష్ణ మరెన్నో సంచలనాలు సినిమాలు కూడా వచ్చాయి. సమరసింహ రెడ్డి లాంటి ఎన్నో సినిమాలు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తూ  బాలకృష్ణను ఎంతో క్రేజ్ తెచ్చి పెట్టాయి. ఇక అప్పటికే మాస్ ప్రేక్షకులు అందరికీ ఫేవరెట్ హీరో గా మారిపోయాడు బాలకృష్ణ. ఇక ఆ తర్వాత కూడా బాలకృష్ణ ఎన్నో యాక్షన్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికికూడా తన యాక్షన్ సినిమాలతో  మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు  నందమూరి బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: