టాలీవుడ్ లో సమంతాకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె సినిమాలు ఇప్పుడు ఏవీ ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం లేదు అని చెప్పాలి. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే ప్రచారం జరుగుతుంది గాని ఏ సినిమాలో ఆమె నటించే అవకాశం ఉంది అనేది ఎవరికి తెలియదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె నిర్మాతగా సినిమాలను చెయ్యాలి అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిర్మాతగా సినిమాలు చేయడానికి ఆమె ప్రయత్నాలు చేస్తుంది అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. నిర్మాతగా ఆమె భర్తతో కలిసి చేసే అవకాశం ఉంది. 

 

ఇక ఇప్పుడు ఆమె మెగా హీరో తో సినిమా చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక కథను వక్కంతం వంశీ దగ్గర ఆమె తీసుకుంది అని ఆ సినిమాను ఒక మెగా హీరోతో చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలోనే ఆమె నుంచి ఒక ప్రకటన వస్తుంది అని సమాచారం. ఆమె ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద చేసే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

 

ఈ సినిమాకు ఆమె దాదాపు 20 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే సూచనలు ఉన్నాయి అనేది టాలీవుడ్ జనాల మాట. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది ఏంటీ అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఈ సినిమా కోసం ఆమె ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తుంది అని వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడమా లేక ఈ ఏడాది తీసుకుని వెళ్ళే అవకాశం ఉందా అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఆమె కూడా ఒక పాత్ర పోషించే అవకాశం ఉందని లేక పోతే భర్త నాగ చైతన్య ని కూడా తీసుకుంటుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: