టాలీవుడ్ ఇండస్ట్రీలో గీతా ఆర్ట్స్ అధినేత గా అల్లు అరవింద్ కొన్ని దశాబ్దాల పాటు భారీ చిత్రాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ‘అలా వైకుంఠపురం లో’ సినిమాను నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను నిర్మిస్తారు అల్లుఅరవింద్. ఈ విధంగానే కొత్త డైరెక్టర్ పరుశురాం తో  ‘గీతగోవిందం’ అనే సినిమాను నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు. పరుశురాం కి లైఫ్ ఇచ్చిసరైన డైరెక్టర్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

IHG

ఇప్పుడు ఇదే విధంగా ‘పలాస 1978’ సినిమాతో సత్తా చాటుకున్న కొత్త దర్శకుడు కరుణ్ కుమార్ తో అదిరిపోయే ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. పలాస సినిమా విడుదలై హిట్ అయిన సమయంలో స్వయంగా అల్లు అరవింద్ ఖచ్చితంగా డైరెక్టర్ కరుణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. తాజాగా ఇప్పుడు అల్లు అరవింద్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో సీనియర్ నటుడు రాజశేఖర్ ని హీరోగా పెట్టి అల్లు అరవింద్ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యారు. కాగా ఈ కంబినేషన్ పై ఒక్కసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ నడుస్తోంది. ఎందుకంటే ఎప్పటినుండో రాజశేఖర్ ఫ్యామిలీ కి మరియు చిరంజీవి ఫ్యామిలీ కి మధ్య అనేక వివాదాలు చోటు చేసుకోవడం జరిగింది.

IHG

ఇదే తరుణంలో ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఓపెనింగ్ కార్యక్రమంలో రాజశేఖర్ వేదిక పైనే చిరంజీవిపై మరియు కొంతమంది పెద్దలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ సమయంలో బహిరంగంగానే చిరంజీవి అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి టైములో చిరు బావ అల్లు అరవింద్ రాజశేఖర్ తో సినిమా చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.  ఇదిలా ఉండగా ఓ భారీ సినిమా నిర్మించి  ఆ తర్వాత చిన్న సినిమా నిర్మిస్తూ బ్యాలెన్సింగ్ గా అరవింద్ చాలా ప్లానింగ్ గా గీతా ఆర్ట్స్ లో సినిమాలను నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ కి అతి తక్కువ బడ్జెట్ లో సినిమాలు నిర్మిస్తూ అదిరిపోయే సేఫ్ గేమ్ ప్లానింగ్ అల్లు అరవింద్ ది అని తాజా ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో సినిమా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: