రోహిణి ఈ పేరు మన ఇంట్లో పిలుచుకునే ఎంతో సాధారణమైన పేరులా ఉంది కదా! ఉండే ఉంటుంది లెండి.. ఇప్పుడు కామన్ కానీ అప్పట్లో ఈ పేరు చాలా అంటే చాలా కొత్తగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ రోహిణి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ? రోహిణి అనే పేరు గల ఆమె గత 50 ఏళ్ళ నుండి మన ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో నటిస్తుంది. 

 

IHG

 

చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ రోహిణి చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఓ 50 సినిమాలు పైగా తీసి ఉంటుంది. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ నుండి కాస్త పెద్దగా అవ్వగానే సౌత్ అంత అంటే మలయాళం, తమిళ్, తెలుగు సినిమాల్లో ఎంతో అద్భుతంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నటించారు. ఇంకా అలా నటిస్తున్న సమయంలో ఆమె రఘువరన్ అనే యాక్టర్ ను పెళ్లి చేసుకుంది. 

 

IHG'We Live In A Time Of Strict Censorship,' Actress Rohini ...

 

అయితే అతను అనారోగ్యం కారణంగా 2004లో మరణించారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొద్దీ రోజులు గ్యాప్ తీసుకున్న రోహిణి నందిని రెడ్డి అలా మోడైలైంది సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇంకా అప్పటి నుండి ఒక పర్ఫెక్ట్ మదర్ క్యారెక్టర్ గా ఎన్నో రోల్స్ నటించమంటే ఈవిడ జీవించేశారు. 

 

IHG

 

దీనికి కారణం ఆమెకు యాక్టింగ్ మీద ఉన్న ప్రేమ.. ఆమెకు నాలుగేళ్ళ వయసు ఉన్నప్పటి నుండి ఎన్నో అద్భుతమైన పాత్రలు చేస్తూ వచ్చిన నటి రోహిణి. తను తల్లి పాత్రలో చాల అద్భుతంగా నటిస్తుంది. ఇంకా అలా మొదలైంది, ఇష్క్ సినిమాలో అయితే ఆమె యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఆమె అమ్మ పాత్రలో నటించింది. అవే బాహుబలి, నేను శైలజ, ఒక లైలా కోసం వంటి సినిమాల్లో ఆమె నటించింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: