సాధారణంగా టాలీవుడ్ లో అయినా మరో పరిశ్రమలో అయినా సరే పాత హీరోయిన్ లకు గుర్తింపు అనేది చాలా తక్కువ గా ఉంటుంది అనే మాట వాస్తవం. ఇప్పుడు ఎక్కువగా పోటీ ఉంది కాబట్టి దాదాపుగా దర్శక నిర్మాతలు పాత హీరోయిన్ లను ఏ మాత్రం కూడా పట్టించుకునే ప్రయత్నం చేయరు అనేది వాస్తవం. వాళ్ళల్లో ఎంత ప్రతిభ ఉన్నా సరే వాళ్లకు ఎంత క్రేజ్ ఉన్నా సరే వాళ్ళను కచ్చిత౦గా పక్కన పెడుతూ ఉంటారు. వారి సినిమాలు అయినా ఏది అయినా ఏ స్థాయిలో విజయం సాధించినా సరే మనం ఇదే ఎక్కువగా చూస్తూ ఉంటా౦. 

 

ఇక ఇది పక్కన పెడితే శ్రీదేవి విషయంలో మాత్రం ఆది నిజం కాదు. ఆమె హీరోయిన్ గా చేయకపోతే కనీసం హీరోయిన్ కి అమ్మగా హీరోకి అక్కగా చేసినా చాలు అనుకుని దర్శక నిర్మాతలు ఆమె చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయి అని అంటారు. ఆమెతో ఒక్క సినిమా చేయించడానికి చాలా మంది దర్శక నిర్మాతలు చాలా విధాలుగా ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత తర్వాత ఆమె కొన్ని పాత్రలు చేసారు గాని అప్పటి వరకు మాత్రం ఆమె అంత హుషారుగా చేయలేదు అనే సంగతి తెలిసిందే. 

 

ఏ ఆఫర్ వచ్చినా సరే ఆమె మాత్రం ఒకటికి వంద సార్లు అలోచించి ఇంట్లో చర్చించి ఆ తర్వాత ఆ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అని టాలీవుడ్  జనాలు చెప్తూ ఉంటారు. ఆమెను బాలీవుడ్ లో కూడా మంచి పాత్రలు చేయమని ఎంత మంది అడిగినా సరే ఆమె చాలా రోజుల పాటు మేకప్ వేసుకోలేదు. సినిమాలకు చాలా రోజుల పాటు దూరంగానే ఉంటూ వచ్చారు ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: