ఏపీలో పాళీ అనే పల్లెటూరు.. 535 మంది జనం.. వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఓ దేవుడు వస్తాడని ఎదురుచూపులు.. ఆ గ్రామంలో ఓ స్వామి చెప్పినట్టుగా నిప్పు, నీరుతో కలిసి వచ్చే హీరో.. అతన్ని వాళ్ళు దేవుడు అని పిలవడం.. వాళ్ళ కష్టాలని తీర్చడానికి వచ్చాడని నమ్మడం. ఆ ప్రజలు తనని దేవుడని ఎందుకు అంటున్నారు అనే విషయాన్ని అర్ధం చేసుకున్న హీరో. ఎదుటి మనిషి కష్టాన్ని అర్ధం చేసుకున్న వాడే దేవుడు. అందుకే ఆ గ్రామ ప్రజలకు తాను కనిపించానని అనుకుంటాడు. 

 

అతిధి తర్వాత మహేష్, త్రివిక్రమ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఖలేజా. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ సినిమా అనగానే సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే సినిమాను ప్రేక్షకులు అర్ధం చేసుకోవడంలో లేట్ అయ్యింది. థియేటర్ లో ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయిన ఆ సినిమా బుల్లితెర మీద సూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఇప్పటికి ఆ సినిమాలో ఒక సీన్ చూసినా సరే అవును భయ్యా.. అసలు ఖలేజా సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందంటావ్ అంటూ పక్కన వాళ్ళని అడగడం ఖాయం.

 

కొన్ని సినిమాలు థియేటర్ లో ఆడకపోయినా స్మాల్ స్క్రీన్ పై సూపర్ హిట్ అవుతాయి. అంతేకాదు ఆన్ లైన్ లో కూడా అలాంటి సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ ఉంటుంది. 2010లో వచ్చిన ఖలేజా సినిమా ఇప్పటికి టీవీల్లో వచ్చినా ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారు. త్రివిక్రమ్ పెన్ పవర్ ఏంటో చూపించిన ఈ సినిమాలో మహేష్ సెన్సార్ హ్యూమర్ కూడా సూపర్ అనిపిస్తుంది. కమర్షియల్ గా హిట్ కాకున్నా ఖలేజా సినిమా అప్పుడు ఇప్పుడు సూపర్ హిట్ ఎంటర్టైనర్ అనే చెప్పొచ్చు. కమర్షియల్ గా హిట్టు కాకున్నా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం సూపర్ హిట్ అందుకుంది మహేష్ ఖలేజా. 

మరింత సమాచారం తెలుసుకోండి: