తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు కాలం చాలా తక్కువ అనే చెప్పాలి. ఏ హీరోయిన్ అయినా దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది . కానీ ఆ తర్వాత కొత్త హీరోయిన్ల రాకతో ఆ హీరోయిన్ కు క్రేజ్ తగ్గిపోతుంది... స్పెషల్ సాంగ్స్ లేదా ఇతర క్యారెక్టర్లలో  కనిపిస్తూ ఉంటుంది. ఇలా  తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగి  ఆ తర్వాత ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు తమదైన అందంతో నటనతో మెప్పించి తెలుగు పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన హీరోయిన్ ప్రస్తుతం ఆమె అత్త అమ్మ పాత్రలో నటిస్తూ మరోసారి సరికొత్త ట్రెండ్ సూచిస్తున్నారు. ఇలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. 

 


 ఇలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఒకరు విజయశాంతి. ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా విజయశాంతికి ఉన్న క్రేజ్ మాత్రం ఒక ప్రత్యేకమైనది.  అప్పట్లో ఎంతో మంది హీరోల సరసన నటించిన విజయశాంతి ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో కూడా నటించి ఎంతో గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది విజయశాంతి. ఇక ఆ తర్వాత సినిమాలను వదిలి రాజకీయాల వైపు నడిచింది విజయశాంతి. ఈ నేపథ్యంలో విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు రి ఎంట్రీ  ఇస్తుందా అని ఎంతగానో ఎదురుచూశారు. చివరికి ప్రేక్షకుల కోరిక రీసెంట్ గానే తీరింది  అని చెప్పాలి. 

 


 మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా లో విజయశాంతి దాదాపు పదమూడేళ్ళ తరవాత తెలుగు ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చింది. విజయశాంతి రీ ఎంట్రీ తో అభిమానులు తెగ మురిసిపోయాడు అని చెప్పాలి, ఇక విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమా లో రీ ఎంట్రీ ఇచ్చి ఒక సైనికుడికి అమ్మ పాత్రలో నటించింది. అంతేకాకుండా ఒక కళాశాల ప్రొఫెసర్ పాత్రలో నటించింది. అప్పట్లో స్టార్ హీరోయిన్గా పవర్ఫుల్ పాత్రల్లో  చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి రీ ఎంట్రీ సినిమాలో కూడా మరో పవర్ ఫుల్ పాత్రలో చేసి తన నటనతో ఎంతో మంది అభిమానులను మెప్పించింది  అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: