నాటితరం స్టార్ హీరోయిన్లు నేటితరంలో అమ్మ అత్త పాత్రలకు ఎక్కువగా సెట్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నేటి తరం హీరోయిన్లకు కూడా లేని అందం అభినయంతో ఇప్పటికి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు చాలా మంది నాటి తరం హీరోయిన్లు. ఇలా అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక రేంజ్ లో ఉండి ఆ తర్వాత ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో ఆమె పాత్రలో నటించి ఆకట్టుకున్న  హీరోయిన్లలో ఒకరు మీనా. అప్పట్లో తన క్యూట్ క్యూట్ స్మైల్ తో.. ఆకట్టుకునే అభినయం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన నటనకు ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది మీనా. అప్పట్లో మీనా కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.. 

 


 తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలయిన చిరంజీవి  నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ సరసన ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది . ముఖ్యంగా మీనా వెంకటేష్ జోడి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులందరికీ ఫేవరెట్గా నిలుస్తూ ఉండేది. ఇద్దరి జోడి ఎప్పుడు రిపీట్ అయినా ఆ సినిమా బ్లాక్బస్టర్ విజయాలను సాధిస్తూ ఉండేది . ఇలా తన అందం అభినయంతో ఆకట్టుకుంటూనే తన నటనతో కూడా వరుస అవకాశాలు దక్కించుకుని టాలీవుడ్ లో దాదాపు దశాబ్ద కాలానికి పైగా కొనసాగింది మీనా. ట్రెడిషనల్ లుక్ తో తెలుగుతనం ఉట్టిపడేలా కట్టు బొట్టుతో ఎన్నో సినిమాల్లో ఆకర్షించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. 

 


 ఇక అప్పట్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన మీనా కొన్ని రోజులపాటు ఎక్కడ వెండి తెరపై కనిపించలేదు. కానీ ఇక ఆ తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన మీనా తల్లి అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అమ్మ పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు ఎంతో మందిని ఆకట్టుకుంది అనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు మీనా ఫేవరేట్ జోడి అయిన వెంకటేష్ తో  కలిసి దృశ్యం సినిమాలో నటించింది. ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో నటించిన మీనా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత జగపతిబాబు సూపర్ స్టార్ కాంబినేషన్లో తెరకెక్కిన కథానాయకుడు సినిమాలో  కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించింది. అయితే వయస్సు దాటి పోతున్నప్పటికీ మీనా అందం మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: