తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ నాటి కాలం నుంచి ఈ నాటి కాలం వరకు ఎంతో మంది హీరోయిన్లు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. చాలా మంది హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకొని ఎన్నో రోజుల పాటు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే సినిమా హీరోయిన్లు అన్న తర్వాత దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగినప్పటికీ ఆ తర్వాత మాత్రం సార్ హీరోయిన్లకు వచ్చే పాత్రలు కాస్త మారుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక కొంతమంది హీరోయిన్లు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగినప్పటికీ ఆ తర్వాత హీరో హీరోయిన్లకు అమ్మగా అత్తగా మారి పోతూ ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో  అమ్మ అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. 

 

 

 ఇందులో మొదటి వరుసలో ఉంటుంది రమ్యకృష్ణ. అప్పట్లో రమ్యకృష్ణ హాట్ హీరోయిన్ గా ఎంతగానో క్రేజ్ ఉండేది. ఓ వైపు తన అందాలతో మరోవైపు తన పవర్ ఫుల్ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది రమ్యకృష్ణ. దాదాపుగా దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.ప్రస్తుతం ఉన్న ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ఎంతో గుర్తింపు సంపాదించింది రమ్యకృష్ణ. ఇక అప్పట్లో రమ్యకృష్ణ అందానికి అభినయానికి నటనకు ఫిదా సినీ ప్రేక్షకులు లేరు  అంటే అతిశయోక్తి కాదు. ఎంతోమందిని ఆకర్షించి వరుస అవకాశాలు కూడా దక్కించుకుంది. 

 


 ఇక ఆ తర్వాత కొత్త హీరోయిన్లు రావడంతో రమ్యకృష్ణ కు కాస్త అవకాశాలు తగ్గాయి. దీంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రమ్యకృష్ణ కాస్త అత్త అమ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది . ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలకు అమ్మ అత్త పాత్రలో నటించింది రమ్యకృష్ణ. ఓ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కు అత్త పాత్రలో నటించింది... ఇక ఆ తర్వాత మొన్నటికి మొన్న నాగచైతన్య హీరోగా నటించిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా లో నాగచైతన్యకు అత్త పాత్రలో నటించింది. టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ అయిన బాహుబలి సినిమాలో ప్రభాస్ కి అమ్మగా శివగామి పాత్రలో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించింది రమ్యకృష్ణ. ఇప్పటికీ  హీరోయిన్లను తలదన్నే అభినయంతో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: