ఇటీవల తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు చిరంజీవి నేతృత్వంలో కలవటంతో, బాలయ్యబాబు భూములను పంచుకోవడానికి కలిశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. దీంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలు అటు పొలిటికల్ గా ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా అనేక సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఈసారి డైరెక్టుగా చిరంజీవిని టార్గెట్ చేసుకుని ఇన్డైరెక్ట్ వ్యాఖ్యలు చేశారు బాలయ్య. చిరంజీవి గతంలో చెప్పిన "మంచి మైకులో చెప్పాలి-చెడు చెవిలో చెప్పాలి" డైలాగ్ ను వెటకారం చేశారు.

IHG

అలా చేస్తే ఎవడికి ఉపయోగం ఉంటూ సూటిగా ప్రశ్నించారు. "చెడు చెవిలో చెప్పాలా.. మంచి మైకులో చెప్పాలా.. ఎందుకు? చెవిలో చెడు చెబితే ఏం చేస్తాడు. అంతర్మథనం పొందడం తప్ప. వాడు చెడు చేశాడు కాబట్టి మనం తిట్టాం కాబట్టి వాడు బాగుపడ్డాడనే తృప్తి ఉండాలి కదా. అది కూడా ఓ సేవ కదా. చెడు చెవిలో చెప్పడానికి నేనన్న మాట (భూములు పంచుకుంటున్నారని) ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. ఒకరి పేరు నేను చెప్పలేదు కదా. అందర్నీ కలిపి అన్నాను." అన్నారు. అదేవిధంగా దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్దరికాన్ని చిరంజీవి అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తల పై బాలయ్య సెటైర్లు వేశారు.

IHG

దాసరి నారాయణరావు లేని నోట్ను కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వారు భర్తీ చేయాలి అని ప్రయత్నిస్తున్నారు. ఒక్క శాతం కూడా ఆ లోటు భర్తీ కాలేదని బాలయ్య బాబు చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో దాసరి నారాయణరావు శిష్యుడు కళ్యాణ్ మాత్రమే ఇండస్ట్రీ పరువు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన స్థానాన్ని ఏ ఒక్కరు కూడా భర్తీ చేయలేరని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కొంతమంది భూములు పంచుకుంటున్నారనే వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడి ఉన్నాను బాలయ్య ప్రకటించారు. ఏది ఏమైనా బాలయ్య బాబు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన ఎక్కడా తగ్గడం లేదని తగ్గేలా కనబడటం లేదని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: