తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నట వారసుడైన బాలకృష్ణ సినీ ప్రస్థానం అద్భుతంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. 9వ తరగతి చదువుతున్న సమయం నుండి తెలుగు చిత్ర పరిశ్రమలో నటించడం మొదలుపెట్టారు నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. కెరీర్ మొదట్లో ఎన్నో పౌరాణిక పాత్రల్లో నటించిన నందమూరి బాలకృష్ణ... ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 

 


 దాదాపు మూడు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన హీరోగా  కొనసాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఓవైపు రాజకీయాలను మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మొదటి నుంచీ మాస్ ప్రేక్షకులను అలరించడంలో బాలకృష్ణకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వున్న విషయం తెలిసిందే. ఎన్నో యాక్షన్  సినిమాలను తెరకెక్కించి ఎంతోమంది మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 

 


 అయితే ఏ హీరో అయినా ఎంత స్థాయికి ఎదిగిన ఇతర హీరోలకు సంబంధించిన కొన్ని సినిమాలు కూడా  ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ కూడా ఇతర హీరోలు నటించిన సినిమాల్లో ఫేవరెట్ సినిమాలు చాలానే ఉన్నాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా అంటే బాలకృష్ణకు ఎంతో ఇష్టం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాల్లో  ముత్తు సినిమా అన్న బాలకృష్ణకు ఎంతో ఇష్టం. అంతేకాకుండా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన అగ్నిపథ్ సినిమాను కూడా బాలకృష్ణకు ఎంతో ఇష్టం.ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన హిట్ కాంబినేషన్ అయినా బోయపాటితో మూడవసారి సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అభిమానుల్లో ఎన్నో అంచనాలు  నెలకొన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: