తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నట వారసుడైన బాలకృష్ణ ప్రస్థానం ఎంతో మహా అద్భుతం అని చెప్పాలి. ఒక కల్మషం లేని మనిషి గా... ఒక అద్భుతమైన నటుడిగా... తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు నందమూరి బాలకృష్ణ. నందమూరి తారకరామారావు అసలు సిసలైన వారసుడిగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను తన సినిమాలతో  అలరించడంలో నందమూరి బాలకృష్ణ సిద్ధహస్తుడు అనే చెప్పాలి. బాలకృష్ణ సినిమా లోని డైలాగులకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే మరి. అందులో తను డైలాగ్లతో యాక్షన్ తో మాయ చేస్తూ ఉంటాడు. 

 


 అయితే మామూలుగా చాలా మంది హీరోలు సినిమాల్లో  ఎన్నో రకాల పేర్లతో నటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందా. పాత్రకు తగ్గట్టుగా సినిమా కొక  పేరు ఉంటుంది. కొన్ని విభిన్నమైనా  పేర్లతో  నటించడం మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు తమ సొంత పేర్లతో కూడా నటిస్తూ ఉంటారు హీరోలు. ఇలా నందమూరి బాలకృష్ణ కూడా ఏకంగా  తన పేరుతోనే ఏడు సినిమాల్లో నటించారు. ఏడు  సినిమాల్లో  తన పాత్రకి పేరు బాలకృష్ణ నే ఉంది.ఇక నందమూరి బాలకృష్ణ నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన తొలి చిత్రం తాతమ్మకల. ఈ సిమిమలో  కూడా నందమూరి బాలకృష్ణ పేరు బాలకృష్ణనే. 

 

 

 అయితే తాతమ్మకల సినిమాలో  తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన సమయంలో నందమూరి బాలకృష్ణ 9 వ తరగతి చదువుతున్నాడు. ఆ సమయంలోనే నందమూరి బాలకృష్ణ తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. తండ్రి నందమూరి తారక రామారావు చరిష్మా మీ  పునికి  తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ... 9వ తరగతి నుంచి తెలుగు  చిత్ర పరిశ్రమలో  నటించడం మొదలుపెట్టారు. నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కెరియర్ లు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు.. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో  అయితే నందమూరి బాలకృష్ణ తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: