తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నట వారసుడైన బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అప్పట్లో బాలకృష్ణ యువకుడిగా ఉన్న సమయంలో ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా కూడా ఉండేవాడు బాలకృష్ణ. బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో మైలురాళ్ళు లాంటి సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చాయి. బాలకృష్ణ నటించిన  సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. 

 


 ఇప్పుడు వరకు బాలకృష్ణ తెరకెక్కించిన చాలా సినిమాలు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి... మాస్ ప్రేక్షకుల్లో  బాలకృష్ణకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చి పెట్టాయి. వాస్తవంగా చెప్పాలంటే మాస్ ప్రేక్షకుల్లో  బాలకృష్ణకు ఉన్నంత క్రేజ్ ఏ హీరోకు లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మూడు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటి వరకు ఎంతోమంది విజయవంతమైన దర్శకులతో పని చేసి ఎన్నో అద్భుత విషయాలను కూడా అందుకున్నారు. కేవలం మాస్ ప్రేక్షకులను అలరించడమే కాదు ఎన్నో పౌరాణిక పాత్రల్లో  కూడా నటించి తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. 

 


 అయితే నందమూరి బాలకృష్ణ నటసామ్రాట్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. నందమూరి బాలకృష్ణ ఎంతోమంది డైరెక్టర్లతో సినిమాలు చేసిన కోదండరామిరెడ్డి మాత్రం ఆయన కెరియర్ లో  ముఖ్యమైన డైరెక్టర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీరిద్దరి కాంబినేషన్ కు క్రేజే వేరు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ ఏకంగా 11 సినిమాల్లో నటించారు. ఇప్పుడు వరకు బాలకృష్ణ ఏ దర్శకుడితో కూడా 11 సినిమాల్లో నటించలేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అందుకే కోదండరామిరెడ్డి బాలకృష్ణ కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులకు ప్రైవేట్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: