నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ తర్వాత ఆ నట ప్రస్థానాన్ని కొనసాగించిన నట సింహం నందమూరి బాలకృష్ణ. 100 సినిమాలకు పైగా చేసినా సరే ఇప్పటికి కుర్ర హీరోలకు ధీటుగా  డ్యాన్సులు, ఫైట్లు చేయడంలో బాలయ్యకు బాలయ్యే సాటి. ఇక డైలాగ్స్ విషయంలో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. శత్రువులకు వార్నింగ్ ఇచ్చే టైం లో బాలయ్య బాబు గర్జించే సింహం మాదిరిగా డైలాగ్ చెబుతుంటే బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే. 

 

క్లాసు, మాస్ అంటే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే బాలకృష్ణ సినిమాలు అప్పుడప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తాయని  చెప్పొచ్చు. బాలకృష్ణ  సినిమాల్లో వీరరసం ఎప్పుడు ఆడియెన్స్ ను సంతృప్తి చేసేలా ఉంటుంది. తెర మీది బాలకృష్ణ శత్రు సంహారం చేస్తుంటే సీట్లలో కూర్చున్న ఆడియెన్స్ సీటీమార్ చేయాల్సిందే. తెలుగు సినీ పరిశ్రమలో జానపదం, పౌరాణికం, సాంఘికం ఎలాంటి నేపథ్యం ఉన్న సినిమాలైనా చేయగల ఒకే ఒక్కడు నందమూరి బాలకృష్ణ. తండ్రి చూపిన బాటలో తూచా తప్పకుండా పాటిస్తూ తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరిగిపోని  సంపాదించుకున్నారు బాలకృష్ణ. 

 

బాలయ్య బాబు సినిమా వస్తే అదో పండుగ వచ్చినట్టే. అప్పట్లో బాలకృష్ణ సినిమాకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు కట్టుకుని మరి సినిమా చూసే వాళ్ళని చెబుతుండేవారు. తరాలు మారినా.. ట్రెండ్ మారినా బాలకృష్ణ సినిమాకు ప్రేక్షకాదరణ మాత్రం మారలేదు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తుంది ఇండియాహెరాల్డ్.కామ్. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్  కొద్దిగంటల క్రితం రిలీజయింది.  ఎప్పటిలానే అంచనాలకు తగినట్టుగా టీజర్ తో మెప్పించేలా చేశాడు బోయపాటి.  ఫస్ట్ రోర్ లో బాలయ్య పంచె కట్టు లుక్కు.. డైలాగ్ కిక్కు నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా చేశాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: