శివ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత బాలీవుడ్ లోనూ తన మార్క్ చూపించాడు. రంగీలా, కంపెనీ, సత్య వంటి చిత్రాలు తెరకెక్కించి అప్పట్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసాడు. అయితే గత కొన్ని ఏళ్ళుగా రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కథ కనిపించడం మానేసింది. కేవలం వివాదాస్పద అంశాలనే తీసుకుని కథగా మలిచి ప్రేక్షకులకి ఇవ్వడం మొదలు పెట్టాడు. దాంతో ఈ అంశాలు పాపులర్ అవుతున్నాయే తప్ప సినిమాలు విజయాలు కావడం లేదు.

IHG

ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సినిమాల మీద ఒకరకమైన అభిప్రాయం జనాల్లో ఏనాడో ఏర్పడింది. అదీగాక రామ్ గోపాల్ వర్మ ఎన్నో సినిమాలని ప్రకటిస్తూ ఉంటాడు. వాటిల్లో చాలా వరకు బయటకి రావు. ఏ సినిమా బయటకి వస్తుందనేది వర్మకి కూడా తెలియదని అంటుంటారు. అయితే లాక్డౌన్ సమయంలో థియేటర్లన్నీ మూతబడిపోవడంతో జనాలు సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

IHG

ఓటీటీ వేదికలుగా ఏ సినిమా పడితే ఆ సినిమాలని చూసేస్తున్నారు. దీని మూలంగా అస్సలు బాగాలేని సినిమాలకి కూడా వ్యూస్ బాగా పెరిగాయి. ఇదే అసలైన సమయం అనుకున్నాడో ఏమో, తన దగ్గర మిగిలిపోయిన పాత సినిమాలని విడుదల చేయాలని డిసైడ్ అయినట్టున్నాడు. మియా మాల్కోవాతో తీసిన క్లైమాక్స్ ఆ విధంగానే రిలీజ్ చేసాడు. అసలే కొత్త సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకి క్లైమాక్స్ సినిమాపై ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. 

IHG


తీరా సినిమా చూశాక అందులో ఏం లేదని తెలిసింది అది వేరే సంగతి. ఆడియన్స్ ఆసక్తిని దృష్టిలో ఉంచుకున్న రామ్ గోపాల్ వర్మ తన దగ్గరున్న మిగతా సినిమాలని కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే నేకెడ్ అనే ట్రైలర్ ని వదిలాడు. అదీగాక కత్రినా కైఫ్ కిడ్నాప్ గురించి మరో సినిమా, గాంధీని చంపిన గాడ్సే గురించిన మరో సినిమాని కూడా రెడీ చేస్తున్నాడు. మొత్తానికి లాక్డౌన్ టైమ్ లో ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: