తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు నందమూరి బాలకృష్ణ... ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా ఖ్యాతిని  సంపాదించిన హీరో నందమూరి బాలకృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది అని చెప్పాలి. కెరీర్ తొలినాళ్లలో నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు నందమూరి బాలకృష్ణ. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో నందమూరి బాలకృష్ణ ఒదిగిపోయి నటించిన తీరు తెలుగు ప్రేక్షకుల అందరిని మంత్రముగ్దుల్ని చేసింది అనే చెప్పాలి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని కీర్తిని సంపాదించి గత నాలుగు దశాబ్దాల నుంచి స్టార్ హీరోగానే కొనసాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. 

 


 మొదటినుంచి మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే  విధంగా ఎన్నో సినిమాలలో నటించిన నందమూరి బాలకృష్ణ..ఏ  హీరోకు సాధ్యం కానీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నప్పటికీ బాలకృష్ణ కు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ ఏ హీరోకు లేదు అనడం లో అతిశయోక్తి లేదు. ఇక బాలకృష్ణ కు సంబంధించి ఏదైనా సినిమా వచ్చిందంటే చాలు మాస్ ప్రేక్షకులు అందరూ పండగ చేసుకుంటారు అని చెప్పాలి. ఇలా మొదటి నుండే  మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నందమూరి బాలకృష్ణ... తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ హీరోగా మారిపోయాడు. 

 


 అయితే కెరీర్ తొలినాళ్లలో నుంచి ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ  అలాగె  కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఎక్కడ లావు ఎక్కలేదు... ఎక్కడా సన్నబడలేదు. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ రోజు వారి జీవిత విధానం కూడా ఎంతో ఆదర్శంగా ఉంటుంది. నందమూరి బాలకృష్ణ తెల్లవారుజామున మూడున్నర గంటలకు నిద్ర లేస్తాడు ప్రతిరోజు. నిద్రలేచిన తర్వాత తప్పనిసరిగా యోగా వ్యాయామం చేస్తారు. అంతేకాకుండా పొద్దున లేవగానే బాలకృష్ణకు చుట్ట కాల్చే  అలవాటు కూడా ఉంది. ఇదే అలవాటు తన తండ్రి ఎన్టీఆర్ కు  ఉండేదని.. ఆయన అలవాటే ఇప్పుడు  నాకు కూడా వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు నందమూరి బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: