ఒకప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సిక్స్ ప్యాక్ ట్రెండ్ ఎక్కువగా కనిపించింది . ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ  ట్రెండ్ వచ్చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎంతో మంది యువ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా సిక్స్ ప్యాక్ చేసి ప్రేక్షకులను మైమరిపించారు చేశారు. కొంతమంది భారీగా కండలు పెంచి ఏకంగా వావ్ అనిపించారు. ప్రస్తుతం అటు సీనియర్ హీరోలు కూడా మంచి ఫిట్నెస్తో ఉంటున్న విషయం తెలిసిందే. యువ హీరోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో అయితే హీరోయిన్లు సైతం ఎంతో ఫిట్ ఉండటానికి జిమ్ లో తెగ కసరత్తులు చేస్తున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో అయినా నాగార్జున సైతం ఐదు పదుల వయస్సులోనూ సిక్స్ ప్యాక్ ట్రై చేసి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.

 

 అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ఇప్పటివరకు సిక్స్ ప్యాక్  జోలికి మాత్రం వెళ్లలేదు. ఎక్కువగా ఫిట్నెస్పైనే కూడా దృష్టి పెట్టలేదు. బాలకృష్ణ ఎలా ఉన్న  ప్రేక్షకులు కూడా  ఆదరిస్తూనే వచ్చారు. ఇక మొదటి నుంచి మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బాలకృష్ణ... తనదైన మ్యానరిజం తో పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటిస్తున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ సిక్స్  ప్యాక్ చేయకపోవడానికి బలమైన కారణమే ఉంది అని అంటున్నారు కొంతమంది. అసలు బాలయ్య సిక్స్ ప్యాక్ జోలికి ఎందుకు వెళ్ళలేదు అని డౌట్ కూడా అందరిలో ఉంది. 

 


 తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇప్పటివరకు  ఎప్పుడూ సిక్స్ ప్యాక్ లో కనిపించలేదు  అని ప్రశ్నించగా... ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు నందమూరి బాలకృష్ణ. తాను చొక్కాలు విప్పి సిక్స్ ప్యాక్ చేసిన ప్రేక్షకులు అంతగా చూడటానికి ఇష్టపడరు అంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ. అదే సమయంలో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ లో ఎందుకు నటించలేదు అని ప్రశ్నించగా.... అటు ప్రేక్షకులు తన నుంచి రొమాన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయరని... తాను రొమాంటిక్ సీన్లలో  ఎక్కువగా నటిస్తే ప్రేక్షకులలు నప్పదు   అంటూ తెలిపారు. అంతేకాకుండా సిక్స్ ప్యాక్  రొమాన్స్ అనేది మన సంస్కృతి కాదని అందుకే వాటికి కాస్త దూరంగానే ఉంటాను  అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: