ఈ మద్య దేశం మొత్తం తల దించుకునే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి.  కొంత మంది రాక్షసులు మూగ జీవాల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు.  ఇటీవల కేరళాలో ఏనుగుల ఉదంతం తెలిసిందే.  ఆ తర్వాత ఆవు కు తినే గడ్డిలో బాంబు పెట్టారు.  లాంటి దేశంలో మూగ జీవాలను ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకునే వారు కూడా ఉన్నారు.  తమ సొంత బిడ్డాల్లా మూగ జీవాలను సాకుతున్న వారు కూడా ఉన్నారు. తన తదనంతరం తన ఆస్తిలో సగం వాటాను రెండు ఏనుగులకు రాసిచ్చాడు ఓ బిహారీ. పెంచుకున్న ప్రేమతోపాటు, వాటిలో ఒక ఏనుగు తన ప్రాణాలను కాపాడినందుకు రుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.

తను పోయాక ఆ మూగజీవాలు ఆకలితో అల్లాడకూడదని రూ. 5 కోట్ల విలువైన భూమిని  రాసిచ్చాడు.  పట్నాలోని పూల్వారీ షరీఫ్ ప్రాంతానికి ఆక్తర్ ఇమాన్ అనే వ్యక్తి వద్ద మోతీ, రాణి అనే రెండు ఏనుగులు ఉన్నాయి.  అతడు ఆసియన్ ఎలిఫెంట్ రిహాబిలిటేషన్ ట్రస్టుకు అధ్యక్షుడు. అయితే తాను మరణించిన తర్వాత ఆ ఏనుగులను ఎవరు నిర్లక్ష్యం చేయొద్దన్న ఉద్దేశంతో రాణి, మోతీల పేర్లపై బ్యాంకులో రూ. 50 వేలు వేశా. ఓ సారి నాపై ఎవరో హత్యాయత్నం చేశారు. మా ఇంట్లోకి తుపాకీతో చొరబడి నన్ను చంపేయబోయారు.

 

ఈ ఏనుగును విషయం పసిగట్టాయి. ఒక ఏనుగు ఘీంకరించి నన్ను నిద్రలేపింది... ఆ దుండగుడు పారిపోయాడు. అప్పటి నుంచి నాకు వాటిపై ప్రేమ మరింత పెరిగిపోయింది.. నా సొంత బిడ్డల్లా చూసుకుంటున్నానని అన్నారు.నా కొడుకు ఒకసారి నాపై తప్పుడు కేసి జైలుకు పంపాడు. అది తప్పుడు కేసు. కన్నకొడుకే అలాంటి పరిచేస్తే, ఈ ఏనుగులు నా ప్రాణాన్ని కాపాడాయి. నా ఆస్తిలో సగం వాటికి, మిగతా సగం నా భార్యకు రాసిచ్చా’ అని ఆక్తర్ చెప్పారు.  అయితే అక్తర్ గత పదేళ్ల క్రితమే తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఆక్తర్ అప్పట్నుంచి ఏనుగులే లోకంగా జీవిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: