తెలుగు సినిమాకు నందమూరి అక్కినేని రెండు కళ్ళు. వాళ్ళిద్దరు అన్నదమ్ములుగా ఉంటూ తెలుగు సినిమాను ముందుకు నడిపారు. ఒక క్రమశిక్షణను అలవాటు చేశారు. తెలుగు సినిమా కళామతల్లి వెలుగుగా నిలిచారు. అటు అక్కినేని, ఇటు నందమూరి అంటూ అభిమానులే కాదు, ప్రజలు కూడా వారిని చూసి మురిసేవారు.

IHG

వారి నటవారసులుగా ఉన్న బాలక్రిష్ణ, , నాగార్జునల మధ్యన అంత మంచి సంబంధాలు లేవు అంటారు. సరే ఒకపుడు ఇద్దరూ కనీసం పలకరించుకునేవారు. ఇపుడు అది కూడా లేనట్లుగా కనిపిస్తోంది. బాలయ్య షష్టి పూర్తి వేళ సీనియర్ హీరోలంతా కూడా ఆయన్ని గ్రీట్ చేశారు. చిరంజీవి మీద బాలయ్య  సెటైర్లు వేసినా కూడా పెద్ద మనసుతో  ఆయన మా బాలయ్య అంటూ ఎంతో ప్రేమగా గ్రీట్ చేశారు.

IHG

 

ఇక వెంకటేష్, మోహన్ బాబు వంటి సీనియర్లు బాలయ్యను అభినందించారు. యంగ్ హీరోల్లో మహేష్ బాబు జూనియర్ ఎన్టీయార్ బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాక్షలు తెలియచేశారు. ఇవన్నీ ఇలా ఉంటే నాగార్జున మాత్రం కనీసం గ్రీట్ చేయకపోవడం చర్చగా ఉంది.

IHG

నాగార్జునకు బాలయ్యకు పడదు అని చాలాకాలంగా వినిపిస్తున్న సంగతే. బాలయ్య కూడా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాను ఒక హిందీ సినిమా రీమేక్ ని తెలుగులో చేద్దామని ఇన హీరోతో ప్రతిపాదించానని, ఆయన దానికి ఎస్ అనంకుండా, నో అనకుండా సైలెంట్ అయ్యారని ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. ఆ హీరో నాగార్జునేనని కూడా అంటున్నారు.

IHG

మొత్తానికి బాలయ్య భూముల కోసం చర్చలా అంటూ ఈ మధ్య చేసిన కామెంట్స్ కూడా నాగ్ మీదనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అన్నదమ్ములుగా తండ్రుల తరంలో ఉంటే కొడుకులు మాత్రం ఇలా మాటలు లేకుండా పోవడం బాధాకరమేనని అంటున్నారు. మొత్తానికి బాలయ్య నాగ్ ల మధ్యన ఏముంది అన్నది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: