ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రస్తుతం రెడ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. కిషోర్ తిరుమల డైరక్షన్ లో కోలీవుడ్ మూవీ తడమ్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా కిషోర్ తిరుమల, రామ్ కలిసి చేస్తున్న ఈ రెడ్ మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రామ్ క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. ఇన్నాళ్లు తన పంథా తనదే అన్నట్టుగా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న రామ్ ఇక  మీదట స్టార్ డైరక్టర్స్ మీద కన్నేసినట్టు తెలుస్తుంది. 

 

రెడ్ తర్వాత రామ్ స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి అసలైతే ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేశాడు. కానీ ప్రభాస్ డేట్స్ ఇప్పుడప్పుడే దొరికే ఛాన్స్  సూరి రామ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా రామ్ సూపర్ హిట్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో కూడా సినిమా చేస్తాడని తెలుస్తుంది.

 

ఈరోజుల్లో సినిమా నుండి ప్రతిరోజూ పండుగే సినిమా వరకు తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చిన మారుతి రామ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అద్దె జరిగితే ఈ కాంబో కచ్చితంగా క్రేజీగా మారుతుందని చెప్పొచ్చు. ఇన్నాళ్లు సెపరేట్ గా సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ వాడుకోని రామ్ ఇక మీదట క్రేజీ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి, మారుతి ఇద్దరు సూపర్ డైరక్టర్స్ తో సినిమా ప్లాన్ చేసిన రామ్ స్కెచ్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఆ రెండు సినిమాల్లో ఒకటి హిట్టయినా రామ్ సత్తా చాటే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: