మన తెలుగులో కొంత మంది స్టార్ హీరోలకు మాస్ సినిమాలు చెయ్యాలి అంటే ఒకరకంగా భయం అనేది ఉంటుంది. దానిని పైకి చెప్పినా లేకపోయినా సరే మాస్ హీరోల సినిమాలు అనేవి ఆడతాయా లేదా అనేది ఆసక్తికర అంశం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే వాటి మీద ఏదోక విమర్శ అనేది మనం ఏదోక సందర్భంలో వింటూ ఉంటాం. అందుకే చాలా మంది స్టార్ హీరోలు మాస్ సినిమాలను చెయ్యాలి అంటే కచ్చితంగా ఒకటికి వంద సార్లు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. అయితే బాలకృష్ణ విషయానికి వస్తే మాత్రం ఆ విధంగా ఉండదు అనేది చాలా మంది చెప్పే మాట. 

 

ఆయన ఏ సినిమా చేసినా సరే మాస్ ఆడియన్స్ ని దృష్టి లో పెట్టుకుని వాళ్లకు ఆయన అభిమానులకు దగ్గరయ్యే విధంగా సినిమాలు చేస్తూ ఉంటారు. అగ్ర హీరో అయినా సరే ఆయన మాస్ ఇమేజ్ ని అన్ని విధాలుగా కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక అది అలా ఉంటే ఆయనను మాస్ కి బాగా దగ్గర చేసిన సినిమా చెన్న కేశవరెడ్డి. ఈ సినిమాలో ఆయన నటనకు మాస్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆయన కత్తి వాడిన విధానం ఒకటి అయితే ఆయన సినిమాలకు అక్కడి నుంచి వచ్చిన ఇమేజ్ ఒకటి బాగా ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి. 

 

అగ్ర హీరోలు ఎవరూ కూడా చేయలేని విధంగా ఆయన మాస్ సినిమాలను చేసారు. ఇక ఆ సినిమాలో ఆయన నటనకు అవార్డ్ కూడా వచ్చింది. రైల్వే ట్రాక్ వద్ద ప్రత్యర్ధులను చంపే సీన్ ఒకటి అయితే ఆ తర్వాత ఆయనను పట్టుకోవడానికి పోలీసులు వచ్చినప్పుడు సత్తిరెడ్డి అంటూ ఆయన అరవగానే కార్ లు  లేచిన విధానం సినిమాకే హైలెట్. అది మాస్ కి బాగా నచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: