అంబానీ డ్రైవర్ కూడా లక్షాధికారే. అంబానీ బాడీ గార్డ్స్ అయితే మిలీనియర్లు.. ఇలా ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే వాళ్ల గురించి సోషల్ మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు దీపికా పదుుకొణే బాడీగార్డ్ గురించి ఇలాగే మాట్లాడుకుంటున్నారు ముంబయి జనాలు. బాలీవుడ్ అంబానీ దీపిక బాడీగార్డ్ కు లక్షల్లో శాలరీ ఇస్తుందని చెప్పుకుంటున్నారు. 

 

దీపిక పదుకొణేకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మిస్ దీపిక నుంచి మిసెస్ రణ్ వీర్ సింగ్ గా మారాక కూడా ఈ ఫాలోయింగ్ తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు దీపిక ఫాలోవర్స్ మరింత పెరిగారు. ఇక పబ్లిక్ ఈవెంట్స్ లో వాళ్లు చేసే హడావిడి మామూలుగా ఉండదు. దీపిక గాలి సోకితే చాలని కలలు కనే వాళ్లు లక్షల్లో ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ నుంచి కాపాడటానికి బాడీగార్డ్ కే నెలకు ఆరు లక్షల అరవై వేల జీతం ఇస్తోందట దీపిక. 

 

దీపిక పదుకొనే దగ్గర జలాల్ అనే వ్యక్తి బాడీ గార్డ్ గా పని చేస్తున్నాడు. ఇతనికి నెలకు ఆరు లక్షల ఇరవై వేల జీవితం ఇస్తోంది దీపిక. అంటే సంవత్సరానికి జలాల్ ప్యాకేజీ 80లక్షల వరకు ఉంటుందని చెపొచ్చు. సో కార్పొరేట్ కంపెనీ ఎంప్లాయిస్ కంటే దీపిక బాడీ గార్డ్ జీతమే భారీగా ఉందనే చెప్పాలి. 

 

దీపిక పదుకొనే బాడీ గార్డ్ కే ఆరు లక్షల అరవై వేల వరకు ఇస్తోందంటే.. ఈమె ఆదాయం ఎంతుంటుందని లెక్కలేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. అయితే రెండేళ్ల క్రితమే యాన్యువల్ ఇన్ కమ్స్ లో వందకోట్లు దాటేసింది దీపిక. సినిమాలు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో దీపిక ఏడాదికి 110కోట్ల వరకు సంపాదిస్తోందని చెబుతున్నారు. అందుకే ఈ బిలియనీర్ బ్యూటీ, బాడీ గార్డ్ కు భారీగా శాలరీ ఇస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: