ప్రస్తుతం నెమ్మదిగా సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో మేకర్స్ ఓటీటీ ప్లాట్ ఫాం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు ఓటిటీ లో నేరిగా రిలీజవుతున్నాయి. ఆమద్య కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య సతీమణి జ్యోతిక నటించిన పోన్మగల్ వందాల్ ని అమోజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో మహానటి ఫేం కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమాని నేరుగా అమోజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠతను రేపుతోంది.  

 

ఇక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ "ఆహా" అన్న పేరుతో ఓటీటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ ప్లాట్ ఫాం లో వరసగా వెబ్ సిరీస్ ని ప్లాన్ చేశారు. అలాగే చిన్న సినిమాలని నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు యంగ్ డైరెక్టర్స్ నుండి సీనియర్ డైరెక్టర్స్ ని ఎంచుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కొన్ని కథ లను సిద్దం చేస్తున్నారట. 

 

అయితే ప్రస్తుతం కరోనా కారణంగా రెండు నెలలుగా సినిమా థియేటర్లు మూత పడే ఉన్నాయి. మరో రెండు, మూడు నెలల వరకు కూడా థియేటర్లు ప్రారంభమయ్యో అవకాశాలు కనిపించడం లేదు. టాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్‌ ఓటీటీపై దృష్టి సారిస్తున్నారు. అందుకే ఇప్పుడు అల్లు అరవింద్‌ "ఆహా" ని సక్సస్ ట్రాక్ లోకి తేవాలని కొత్త ప్లాన్స్ వేస్తున్నారు.  ఆహా లో కొన్ని సినిమాలని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే రిలీజ్ కి సిద్దంగా ఉన్న కొన్ని సినిమాల మేకర్స్ మధ్య చర్చలు జరుపుతున్నారట.

 

దీన్ని బట్టి చూస్తే త్వరలో ఆహా లో టాలీవుడ్ సినిమాలు చూసేయొచ్చు. నాని వి, రాం రెడ్, రవితేజ క్రాక్, అనుష్క నిశబ్ధం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమాలు గనక ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటే అల్లు అరవింద్ ఆహా లో రిలీజ్ అయ్యో అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట.  

మరింత సమాచారం తెలుసుకోండి: