టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు కామెడి చెయ్యాలి అనగానే కాస్త నామోషి గా ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది స్టార్ హీరోలు కామెడి చేసే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది మన తెలుగులో అయినా ఏ భాష లో అయినా సరే. అయితే చిరంజీవి విషయంలో మాత్రం అలాంటిది ఎక్కడా కూడా కనపడదు. ఆయన ఏ సినిమా చేసినా సరే అందులో కచ్చితంగా కామెడి ఉండే విధంగా జాగ్రత్త పడుతూ ఉంటారు అనే చెప్పాలి. ఆయన కామెడికి చాలా మంది మహిళా అభిమానులు కూడా ఉన్నారు. 

 

ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే చిరంజీవి కామెడి చేసే విషయంలో మాత్రం రాజీ పడే  అవకాశమే ఉండదు అని చెప్పాలి. ఏ సన్నివేశంలో అయినా సరే కామెడిని చాలా సమర్ధవంతంగా పండించే సామర్ధ్యం ఆయన సొంతం. అందుకే చిరంజీవి సినిమాల్లో కామెడి విషయంలో పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఉండదు దర్శక నిర్మాతలు అని చెప్తూ ఉంటారు. ఆయన హీరో గా వచ్చిన సినిమాలలో ప్రత్యేకంగా కామెడీ కోసమే దర్శక రచయితలు సీన్ లు రాస్తూ ఉంటారు అని చాలా  మంది అంటూ ఉంటారు. ఆయన కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా ఆయన కామెడి చేసిన సినిమాలే. 


 
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఆయన కామెడి మాత్రం సూపర్ హిట్ అవుతుంది అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ దర్శకుడు అయినా సరే ఆయన కామెడి కి కచ్చితంగా ఫిదా అవ్వాలి అనేది వాస్తవం. అందుకే ఆయన కామెడి విషయంలో చాలా మంది అభిమానులకు ఒక పిచ్చి అనేది ఉంటుందని అంటారు సినీ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: