ఇప్పుడు మన తెలుగులో రాణాకు మంచి క్రేజ్ ఉంది. అతని సినిమాలు అన్నీ కూడా ఈ మధ్య కాలంలో షూటింగ్ లోనే ఉన్నాయి. దాదాపు మూడు సినిమాల్లో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతని సినిమాల విషయంలో ఇప్పుడు దర్శక నిర్మాతలు కూడా బడ్జెట్ తక్కువగా ఉండటం తో ఓకే చేస్తున్నారు అని తెలుస్తుంది. అగ్ర హీరో అయినా సరే తన పరిధి లో మాత్రమే తాను సినిమాలు చేస్తూ ఉంటాడు రానా. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా రానా తో సినిమాలను ముందుకు తీసుకుని వెళ్ళాలి అని భావిస్తున్నారు. ఇక ఈ తరుణంలో రానా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

 

అతను తానే నిర్మాతగా తానే దర్శకుడిగా ఒక సినిమాను చేసే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తుంది. ఒక కరోనా డాక్టర్ లైఫ్ స్టైల్ మీద అతను సినిమా చేసే అవకాశం ఉంది అని సమాచారం. ఒక కరోనా వైద్యం చేసే డాక్టర్ కి కరోనా సోకింది అని అక్కడి నుంచి అతని తల్లికి పిల్లలకు కూడా కరోనా సోకింది అని అతను జీవితంతో పోరాడుతూ ఒక ఇంట్లోనే ఉండి అతని ని కాపాడుకుంటూనే ఒక తన కుటుంబాన్ని కాపాడుకునే విధంగా జీవితం ఉంటుంది అని సమాచారం. ఆ కథ ఆధారంగా ఇప్పుడు రానా సినిమా చెయ్యాలి అని ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ లో. 

 

అతను ఆ కథను ఇప్పటికే పూర్తిగా రెడీ చేసుకున్నాడు అని దీనిని కాబోయే భార్య చేతుల మీదుగా మొదలు పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంత వరకు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది. ఇప్పుడు ఈ సినిమా గురించి తండ్రి సురేష్ బాబు తో ఆయన చర్చలు కూడా జరుపుతున్నారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: