చిన్న చిన్న సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి చేస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల్ విషయంలోనే వంద జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి మన తెలుగులో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు సినిమాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు ఉండదు అనే వార్తలు రావడంతో ఇప్పుడు సినిమాలను నిర్మించే విషయంలో దర్శక నిర్మాతలు ఒకటికి వంద సార్లు ఆలోచించే  పరిస్థితి ఏర్పడింది. ఇక చిన్న చిన్న సినిమాల విషయంలో ఇప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. 

 

అదేంటి అంటే సినిమాలను ఇక నుంచి పాటలు లేకుండా ఒకటి రెండు పాటలు మాత్రమే ఉంచాలి అని పాటలు లేకుండా కథతో సినిమాను తీసుకుని రావాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏ చిన్న హీరో సినిమా అయినా సరే ఇదే విధంగా ముందుకు వెళ్ళే ఆలోచనలో టాలీవుడ్ జనాలు ఉన్నారు అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. పాటల విషయంలో  బడ్జెట్ పెట్టాలి అని ఇక నుంచి బడ్జెట్ లేకుండా సినిమాలను చెయ్యాలి అని భావిస్తున్నారు. అది అనవసరంగా ఖర్చు అని వాటి కోసం లొకేషన్ లు వెతుక్కోవడంతో సమయం డబ్బు అన్ని వృధా అని భావిస్తున్నట్టు సమాచారం. 

 

నానీ శర్వానంద్ నిఖిల్ నితిన్ వంటి హీరోల సినిమాల్లో పాటలను చాలా తక్కువగా ఉంచాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి అది ఎంత వరకు నిజమో గాని దీని విషయంలో ఇప్పటికే స్టార్ హీరోలకు దర్శక నిర్మాతలు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరోలు కూడా పాటలను తగ్గించుకుంటే మంచిది అని చెప్పారట. మరి ఎంత వరకు వారు తగ్గించుకుని సినిమాలను భవిష్యత్తులో చేసే అవకాశం ఉంది అనేది చూడాలి. అగ్ర హీరోలు అయినా సరే ఇదే ప్లాన్ అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: