ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు గా ఎంట్రీ ఇచ్చి తమ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు అందరు మెగా హీరోలు. అయితే ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్  మెగా హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన విషయం తెలిసిందే. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వరుణ్ తేజ్ తెలుగు ప్రేక్షకులందరికీ మెగా ప్రిన్స్ గా మారిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్లో టాలెస్ట్ హీరోగా కూడా రికార్డు సృష్టించాడు వరుణ్ తేజ్. అయితే వరుణ్ తేజ్ మొదటి నుంచి తన యాక్షన్ ఎలిమెంట్స్ తో అదరగొట్టడంతో పాటు తన కామెడీ టైమింగ్ తో కూడా ఇరగదీస్తున్న విషయం తెలిసిందే. 

 


 ఫిదా సినిమాలో తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు వరుణ్ తేజ్ . ఇక ఆ తర్వాత వరుణ్ తేజ్ వెంకటేష్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించటమే కాదు. .  ఎంతో మంది భర్తలకు కనెక్ట్ అయిపోయింది ఈ స్టోరీ. అందుకే ఈ సినిమా ఎన్నిసార్లు వచ్చినా తెలుగు ప్రేక్షకులు చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. 

 

 అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ ను  తెలుగు ప్రేక్షకులు చూడని విధంగా అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. పూర్తిగా తెలంగాణ యాసలో  అద్భుతమైన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు వరుణ్ తేజ్. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటించింది. మామూలుగానే వెంకటేష్ కామెడీతో ఇరగదీస్తాడు... అలాంటి వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ కూడా తనదైన స్టైల్ లో  సరికొత్త కామెడీ యాంగిల్ ని చూపించి.. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతోపాటు తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: