అక్షయ్ కుమార్ నటించిన 'మిషన్ మంగళ్' సినిమా తో నిత్యామీనన్ అప్పట్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో కీలకమైన రోల్ పోషించిన నిత్యా మీనన్ బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ‘మిషన్ మంగళ్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. సినిమాలో కాదనుకోండి అది వెబ్ సిరీస్.

IHG's 'Breathe' season 2 to release this July

వాస్తవానికి గతంలో నిత్యామీనన్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అనేక అవకాశాలు రావడం జరిగింది. కానీ సున్నితంగా తిరస్కరించింది. కానీ 'మిషన్ మంగళ్' సినిమాలో క్యారెక్టర్ బాగా నచ్చడంతో ఓకే చేసింది. అయితే ఇప్పుడు అభిషేక్ బచ్చన్ తో బంపర్ ఆఫర్ దక్కించుకున్న నిత్యామీనన్, వెబ్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. చాలా గప్ చుప్ గా ఎవరు ఊహించని విధంగా సినిమా ప్రేక్షకులకు సడన్ షాక్ ఇచ్చింది సినిమా యూనిట్. 

Nithya Menen joins IHG for 'Breathe' Season Two ...

ఇదిలా ఉండగా వెబ్ సిరీస్ గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న వార్త ఏమిటంటే అభిషేక్ బచ్చన్ కంటే నిత్యామీనన్ యాక్టింగ్ అదరగొట్టింది అని, అభిషేక్ బచ్చన్ ని డామినేట్ చేసిందని అంటున్నారు. ‘బ్రీత్ ఇన్ టు ద షాడోస్’ పేరుతో వస్తున్న ఈ సెకండ్ వెబ్ సిరీస్ జులై పదవ తారీఖున అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ కాబోతుంది. మొదటి వెబ్ సిరీస్ లో మాధవన్ ప్రధాన పాత్రా పోషించారు. కాగా సీక్వెల్ లో అభిషేక్ బచ్చెన్ నటించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: