కరోనా వైరస్ కారణంగా చాలామంది జీవితాలు తల్లకిందులు అయ్యాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏ రోజుకి ఆ రోజు బతికి జీవితాలు లాక్ డౌన్ కారణంగా ప్రమాదంలో పడటంతో మొదటిలో ప్రభుత్వాలు కొంతమేర సహాయం చేశాయి. రేషన్ ఇవ్వటం మరియు నగదు ప్రకటించటం ఇలాంటివి కార్యక్రమాలు చేసి చాలా మంది ప్రజలను ఆదుకోవడం జరిగింది. ఇదే సమయంలో సమాజంలో ఉండే ప్రముఖులు కూడా ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూనే మరోపక్క పేద వాళ్లను ఆదుకునే ప్రయత్నాలు కార్యక్రమాలు చేశారు. ఇలాంటి తరుణంలో స్టార్ హీరో సూర్య... పేద వారిని ఆదుకోవాలి చేతనైనంత వరకూ మీరు వారికి హెల్ప్ చేయండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు.

IHG

నటుడిగా వెండితెరపై ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాడో అదేరీతిలో సమాజంలో ఇతరులకు కూడా సాయం చేయడంలో హీరో సూర్య ముందుంటాడు. తాను స్థాపించిన అగరం ఫౌండేషన్‌ ద్వారా పేద విద్యార్థులకు ఎప్పటినుండో ఉచితంగా చదువు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. గత పది సంవత్సరాల నుండి ఈ ఫౌండేషన్ ను హీరో సూర్య నిర్వహిస్తున్నారు.

IHG

ఇటువంటి తరుణంలో తనను ఎంతగానో అభిమానించే అభిమానులకు ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని లెటర్ రాస్తూ… ఇటువంటి కష్ట కాలంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని… ఇది సాధారణ విషయం కాదని తెలిపారు. ఇప్పటికే ఈ విపత్తులో మీలో ఎవరైతే సేవా కార్యక్రమాలు చేశారో వారందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చారు. ఇలాంటి కష్ట కాలంలో భూమి మీద ఉన్న మీరు ఎంతగా పేదవారికి ఉపయోగపడతారో అంతగా ఉపయోగపడి ఇది ఒక అవకాశం అని, తోటి వారిని ఆదుకోండి.. అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: