మన తెలుగులో  నాగార్జున సినిమాలకు ఒకప్పుడు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు ప్రేక్షకులు ప్రత్యేకంగా హాల్ కి వెళ్లి చూసే  పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు కాస్త ఆదరణ తగ్గింది గాని గతంలో ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు ఒక రకంగా పండగ అనే చెప్పాలి. ఆయన సినిమాల్లో ఉండే చాలా సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటాయి అనే చెప్పాలి. ఆయన హీరో గా వచ్చిన చాలా సినిమాలు సీన్ ల ఆధారంగానే హిట్ అయ్యాయి అని చెప్తారు జనాలు. 

 

ఆయన హీరో గా వచ్చిన మాస్ సినిమాలో అయితే కొన్ని కొన్ని సన్నివేశాలు అప్పుడు ఒక ఊపు ఊపాయి అనేది వాస్తావం. ఆ సినిమాలి చాలా వరకు సన్నివేశాలు మాస్ కి నచ్చాయి. ఫోన్ చేసి విలన్ కి డేట్ చెప్పడం ఆ డేట్ గురించి నాలుగు అయిదు సార్లు ఫోన్ లు చేయడం ఆ తర్వాత జరిగే సంఘటనల గురించి వివరించడం అన్నీ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక జ్యోతిక విషయంలో అతను చేసిన కొన్ని కొన్ని పనులు కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆ సినిమా చూసిన అందరికి ఆ సీన్ లు అనేవి చాల బాగా నచ్చుతాయి. 

 

ఇక అది పక్కన పెడితే సునీల్  చనిపోయిన సీన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే చెప్పాలి. సునీల్ ఆ సినిమాలో నాగ్ కి ఫ్రెండ్ గా నటించాడు. ఆ సినిమా తర్వాత నాగార్జున ఒక  మంచి సినిమా చేయడానికి చాలా రోజులు పాటయింది అనే చెప్పాలి. ఆయనకు ఇప్పటికి కూడా ఆ రేంజ్ లో హిట్ రాలేదు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: