టాలీవుడ్ లో చిరంజీవి సినిమాలకు ఉండే ఆదరణ గురించి పత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదల అవుతుంది అంటే చాలు కచ్చితంగా హాల్ కి వెళ్లి చూసే పరిస్థితి ఉంటుంది. ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే జనాలకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది అనే విషయం అందరికి తెలిసిందే. చిరంజీవి చాలా వరకు కూడా ఆయన సినిమాలను మాస్ కి నచ్చే విధంగానే తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో మాస్ ని ఆకట్టుకున్న సినిమాలే చాలా బాగా హైలెట్ అయ్యాయి కూడా అనేది వాస్తవం. 

 

ఇక ఆయన కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. బాలీవుడ్ రీమేక్ సినిమా అయినా సరే దానిని చాలా బాగా తెలుగులో చూపించారు అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఆ సినిమా కూడా ఒక సంచలనం. ఇక ఆ సినిమాలో చిరంజీవి కాలేజి లోకి అడుగు పెట్టే సీన్ అయితే షేక్ చేసింది అనే చెప్పవచ్చు. ఏ హీరో కూడా ఆ స్థాయిలో మాస్ ని ఊపెయలేదు కూడా. ఇక ఆ తర్వాత ప్రేమ విషయంలో కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షులకు నచ్చాయి అని చెప్పవచ్చు. అలా ప్రతీ సీన్ కూడా జనాలకు ఏదోక విధంగా నచ్చింది ఆ సినిమాలో అని చెప్పవచ్చు. 

 

సినిమా తర్వాతః చిరంజీవి పెద్దగా సినిమాలను చేయలేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన ఒక సినిమాలో నటిస్తుండగా మరో సినిమా లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు అన్నీ కూడా వచ్చే ఏడాది రానున్నాయి. ఆచార్య సినిమాలో ఆయన మావోయిస్ట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లేట్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: