బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం లెజెండ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఒక సంచలనం. ఈ సినిమాలో విలన్ గా నటించిన జగపతి బాబు నటన బాలయ్య నటన అన్నీ కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తున్నాయి అనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా ఈ సినిమాలో బాలయ్య జీవించారు అనేది వాస్తవం. ఇక  జగపతి బాబు కూడా విలన్ గా చాలా బాగా ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయనకు మంచి ఆఫర్లు కూడా వచ్చాయి అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. 

 

ఈ సినిమాలో వైజాగ్ బీచ్  రోడ్ లో ఒక సన్నివేశం ఉంటుంది. అది ఏంటీ అంటే బాలకృష్ణ విలన్ తమ్ముడ్ని రోడ్డు మీద పడుకోబెట్టి కాలు మీద పెట్టగా అప్పుడు విలన్ వచ్చి  కాస్త ఘర్షణ వాతావరణం ఉంటుంది. అదే సమయంలో జోక్యం చేసుకున్న పోలీసులు కాస్త వేగంగా స్పందించి గొడవను ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సీన్ కి హాల్ లో చప్పట్లు కొట్టడమే కాదు బాలయ్య అభిమానులకు ఒక ఊపు వచ్చింది ఆ సీన్ చూసి అని చెప్పాలి. ఇక ఆ సినిమా తర్వాత బాలయ్యకు మంచి పేరు వచ్చింది. 

 

అయినా సరే ఆయన చాలా జాగ్రత్తగా సినిమాలు చేసినా సరే ఎక్కువగా ఫ్లాప్ లు ఉండటం ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది అని చెప్పవచ్చు. ఇక  ఇప్పుడు ఆయన మళ్ళీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సీన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన గ్రామ సర్పంచ్ గా నటిస్తున్నారు అని సమాచారం. ఈ సినిమాను లాక్ డౌన్ కారణంగా వాయిదా అవేయగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: