సినిమా పరిశ్రమ కరోనా కోరల్లో చిక్కుకుంది. తీవ్ర నష్టాల పాలైన ఇండస్ట్రీ ఇప్పట్లో గట్టేక్కాలా కనిపించడం లేదు. దాంతో సినిమాను థియేటర్ లో చూసేదెప్పుడు.. అనే భావన అందరిలోనూ ఏర్పడింది. 

 

కరోనా ఎఫెక్ట్.. సినిమా మీద ఆధారపడ్డ ఎందరో సినీ కార్మికులను దిక్కుతోచని స్థితిలో పడేసింది. కరోనా పంజా విసురుతున్న వేళ, నియమ నిబంధనలతో షూటింగ్ లు మొదలైనా.. సినిమా కంప్లీట్ కావాలంటే మునుపటిలా సాధారణ పరిస్థితులు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఎంతో కష్టపడి సినిమా పూర్తి చేసినా.. థియేటర్ల పరిస్థితి ఏంటనేది ఇంకా తేలడం లేదు. 

 

థియేటర్ లో రవితేజలా రచ్చ చేయాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుందనేది ఇప్పుడే చెప్పలేం. ఈ నేపథ్యంలో ఓటీటీ ఒక ఆప్షన్ లా మారింది. చేసేది లేక చిన్న సినిమాల నిర్మాతలు.. ఓటీటీల వైపు చూస్తున్నారు. కానీ పెద్ద సినిమాల పరిస్థితి ఏంటి.. వందల కోట్ల ప్రాజెక్టులకు కలిసి రావాలంటే.. థియేటర్స్ ఓపెన్ అవాల్సిందే. లేకపోతే నిర్మాతలు తీవ్ర నష్టాలను చూడాల్సి ఉంటుంది. 

 

సినిమాల్లో చూపించినట్టు.. నిర్మాతలు అప్పుల పాలు కాకుండా ఉండాలంటే.. థియేటర్స్ ఓపెన్ కావాలి. భారీ ఓపెనింగ్స్ రావాలి. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. ఒకవేళ థియేటర్స్ తెరిచినా జనాలు వస్తారా.. అందులోనూ సోషల్ డిస్టెన్స్ కోసం సీటు విడిచి సీటు టికెట్స్ బుకింగ్ జరపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్స్ తిరిగి ప్రారంభించకపోవడమే మంచిదంటున్నారు. 

 

చైనా, దుబాయ్ లాంటి దేశాల్లో కరోనా కాలంలో థియేటర్లు తిరిగి ఓపెన్ చేశారు. అయితే అక్కడ కేవలం 2శాతం మాత్రమే ఆక్యుపెన్సీ దక్కింది. అంటే మిగతా 98శాతం సీట్లు.. ఖాళీగానే మిగిలిపోయాయి. అలాంటప్పుడు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టాలు తప్పవు. దాంతో చేసేది లేక చైనాలో థియేటర్లు మళ్లీ మూసివేశారు. మన దగ్గర కూడా థియేటర్లు తెరిచినా మళ్లీ మూసేయాల్సి ఉంటుందనీ.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: