ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెడిషినల్ లుక్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని... స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న హీరోయిన్లలో  ముందు వరుసలో ఉంటుంది రష్మిక మందన. ఈ అమ్మడి పేరు చెప్తే చాలు అందరూ ఉర్రుతలూగి పోతారు  అని చెప్పాలి. ఈ అమ్మడు ఒక చిలిపి నవ్వు నవ్విందంటే  చాలు తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోతారు. ఒకసారి అలా కన్నుగీటిందా ఇక  అంతే ఢమాల్ మనీ పడిపోతారు. చలో సినిమా తో నాగశౌర్య తో జోడీ కట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది రష్మిక మందన. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. 

 

 అయితే చేసిన కొన్ని సినిమాల్లోనే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగి అని చెప్పాలి. చలో సినిమా తర్వాత అర్జున్ రెడ్డి హిట్ తో మంచి జోష్ మీదున్న విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ కు జోడీగా నటించింది. ఇక ఈ సినిమాలో గడుసు పిల్ల గా నటించిన రష్మిక మందన తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో  గీత గోవింద సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన సరిలేరు నీకెవ్వరు... తర్వాత వచ్చిన భీష్మ సినిమాలు కూడా  సంచలన విజయాన్ని నమోదు చేశాయి. 

 

 దీంతో స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది  రష్మిక మందన. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని యూత్ అందరికీ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన. కానీ ఇప్పటివరకు ఎక్కడ అందాల ఆరబోత మాత్రం చేయలేదు. ట్రెడిషనల్ లుక్ తోనే తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తూ  వచ్చింది రష్మిక మందన. అయితే ఇప్పటి వరకు ట్రెడిషనల్ లుక్ లో చూసి రష్మిక మందన ను ఎంతగానో ఆదరించిన తెలుగు అభిమానులు.. కొంతమంది రష్మిక మందన హాట్ లుక్ లో కనిపిస్తే చూడాలని ఆశ పడుతున్నారట. మరి ప్రేక్షకుల కోరిక రష్మిక మందన ఎప్పుడు తీస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: