తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడు కొత్త హీరోయిన్ లు  వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది తమ అందాల ఆరబోతతో ఎంతో క్రేజ్ సంపాదించుకుని  స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగితే కొంతమంది కేవలం ట్రెడిషనల్ లుక్ తోనే తెలుగు ప్రేక్షకులను ఆకర్షించి  స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకుంటారు. కొంతమంది తమ హాట్ హాట్ అందాలతో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటే  కొంతమంది తమ అభినయం అందంతోనే దర్శక నిర్మాతలను ఆకర్షిస్తుంటారు. అయితే ఒకప్పుడు హాట్ హాట్ అందాలను ఆరబోసి... ప్రస్తుతం క్యూట్  క్యూట్  స్మైల్  తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తున్న హీరోయిన్ లలో ఒకరు అక్కినేని వారి కోడలు  సమంత. 

 

 తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని వారి కోడలు సమంత కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసేసింది . తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగిన సమంత మొదట ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది. పొట్టి పొట్టి డ్రెస్సులతో కూడా ఎంతోమందిలో హిట్ పుట్టించింది  ఈ అమ్మడు. అప్పటి వరకు ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల అందాల దేవత గా మారిపోయిన సమంత... పెళ్లి తర్వాత మాత్రం తన పంథాని  మార్చుకుంది. 

 


 కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ దూసుకుపోయింది సమంత. గ్లామరస్ పాత్రలకు  పూర్తిగా దూరమైంది. హాట్ అందాలు లేకపోయినప్పటికీ క్యూట్  స్మైల్  తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది సమంత. దీంతో అటు హాట్ అందాల ఆరబోతలో అయినా ఇటు ట్రెడిషనల్ లుక్ లో ఆయన తనకు తిరుగులేదని తెలుగు చిత్ర పరిశ్రమలో నిరూపించింది అని చెప్పాలి. అయితే ఇలా తెలుగు ప్రేక్షకులను హాట్ లుక్ లో ట్రెడిషనల్ లుక్ లో  అలరించిన హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉంటారు. అందులో మొదటి వరుసలో ఉంటుంది సమంత . ప్రస్తుతం సమంత కేవలం నటిగానే కాకుండా ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ గా కూడా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: