సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ 15 ఏళ్ల నుండి హీరోయిన్ గా నటిస్తున్నా ఇప్పటికి తన ఫామ్ కొనసాగిస్తూనే ఉంది. మధ్యలో నిశ్చితార్ధం చేసుకుని పెళ్లంటూ హడావిడి చేసిన ఈ అమ్మడు ఎంగేజ్మెంట్ తోనే పెళ్లి ప్రయత్నాలు ఆపేసింది. పెళ్లి క్యాన్సిల్ అవడంతో మళ్లీ తిరిగి సినిమాల మీద ఫోకస్ పెట్టిన త్రిష తెలుగులో పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయినా తమిళంలో మాత్రం సూపర్ హిట్లు కొడుతుంది. రెండేళ్ల క్రితం అక్కడ వచ్చిన 96 మూవీ త్రిషకు బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఆ సినిమా హిట్ తో త్రిష అక్కడ మళ్లీ ఫాం లోకి వచ్చింది.  

 

ఇక సినిమాలు చేస్తున్నా సరే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటున్న త్రిష లేటెస్ట్ గా టిక్ టాక్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. త్రిష టిక్ టాక్ వీడియోస్ ఇలా పెట్టడమే ఆలస్యం అలా వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా అమ్మదు ఓ సాంగ్ కు డ్యన్స్ చేస్తూ కెమెరాని మిస్ అవుతున్నట్టు వెళ్లడించింది. ప్రస్తుతం ఆ సాంగ్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. త్రిష నువ్వేం చేసినా సూపరంతే అంటూ తన ఫ్యన్స్ అండ్ ఫాలోవర్స్ ఆమెను తెగ పొగిడేస్తున్నారు. తన స్టైల్ లో డ్యాన్సులతో అలరిస్తున్న త్రిష టిక్ టాక్ లో అతి తక్కువ కాలంలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. 

 

ఆల్రెడీ స్టార్ అయిన త్రిష టిక్ టాక్ లో సందడి చేయడం టిక్ టాక్ ఫ్యన్స్ ను ఖుషి చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్న త్రిష లాక్ డౌన్ టైం లో కెమెరాని మిస్ అవుతున్న ఫీలింగ్ లేకుండా టిక్ టాక్ వీడియోస్ చేస్తూ సందడి చేస్తుంది. తెలుగులో సినిమా ఛాన్సులు వచ్చినా సరే కాదంటూ తమిల సినిమాలు చేస్తున్న త్రిష అందుకు కారణం మాత్రం చెప్పట్లేదు. కేవలం కథలు నచ్చకనే టాలీవుడ్ కు నో చెబుతుందా లేక అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వట్లేదని ఇక్కడ సినిమాలు చేయట్లేదా అన్నది తెలియాల్సి ఉంది.

@trishakrishnan

Clearly I miss the camera 🎥 😅 ##cannibal ##tiktok ##tiktokindia

♬ original sound - elizaminorr

మరింత సమాచారం తెలుసుకోండి: