మంచు ఫ్యామిలీ హీరో రాకింగ్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మంచు మనోజ్ కొన్నాళ్లుగా కెరియర్ లో వెనుకపడ్డాడు. 2017లో ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో లో కొన్ని మార్పులు చేసుకున్నాడు. ఇక లేటెస్ట్ గా అహం బ్రహ్మస్మి సినిమాతో మరోసారి వెండితెర మీద తన వీర ప్రతాపం చూపించనున్నాడు మనోజ్. శ్రీకాంత్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న అహం బ్రహ్మస్మి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈసారి టార్గెట్ మిస్ అవకుండా గురి పెట్టినట్టు కనిపించాడు మంచు మనోజ్.  

 

అందుకే కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నాడు. ఈమధ్య తెలుగు సినిమాల మీద బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ హిట్టైన యాక్షన్ సినిమాలు డబ్ అయ్యి హింది యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధిస్తున్నాయి. అందుకే అల్లు అర్జున్ పుష్ప, విజయ్ దేవరకొండ పూరి మూవీతో, నిఖిల్ కార్తికేయ 2 కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వాటితో పాటుగా మంచు మనోజ్ కూడా అహం బ్రహ్మస్మిని తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హింది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. 

 

సినిమా కథ, కథనాలు కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. ప్రయోగాలు చేయడంలో ఎప్పుడు ముందుండే మనోజ్ ఈ సినిమాను సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. డెబ్యూ డైరక్టర్ అయినా కూడా శ్రీకాంత్ మేకింగ్ మీద నమ్మకంతో మంచు మనోజ్ ఈ సాహసం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి మంచు మనోజ్ ఈసారైనా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.                       

మరింత సమాచారం తెలుసుకోండి: