టాలీవుడ్ లో ఇప్పుడు  రష్మిక కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక సినిమాలు అనగానే యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఆమె ఈ ఏడాది రెండు హిట్స్ తో టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇక ఆమె నటనకు ఆమె డాన్స్ కు మంచి గుర్తింపు కూడా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు అందరు స్టార్ హీరోలతోనే ఆమె ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె తెలుగులో కొన్ని కొన్ని సినిమాలు వద్దు అనుకునే ఆలోచనలో ఉంది అని సమాచారం. 

 

దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆమె మాత్రం తెలుగులో సినిమాలు వద్దు అని చెప్పి కన్నడం లో సినిమాలను ఎక్కువగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అక్కడ ఆమెకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఆమె అక్కడ సినిమాలను ఎక్కువగా చేస్తుంది. ఇటీవల ఆమె స్టార్ హీరోల తో సినిమాలను అక్కడ సైన్ చేసింది. అక్కడ ఆమెకు ధర కూడా ఏమీ తగ్గించే పరిస్థితి లేదు అనే చెప్పాలి. అందుకే ఆమె అక్కడే సినిమాలు చేస్తుంది. 

 

ఇటీవల నితిన్ సినిమాకు గానూ ఆమెను అడగగా ఆమె అందుకు నో చెప్పింది అని సమాచారం. మరి ఎందుకు వద్దు అని చెప్పింది అనేది తెలియదు గాని ఆమె అసలు ఇక్కడ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అనేది స్పష్టం అవుతుంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు సినిమాలకు డిమాండ్ లేదు అనే సంగతి తెలిసిందే. అందులో భాగంగానే హీరోయిన్ లకు ధరలు తగ్గిస్తున్నారు. అలాగే తెలుగులో కూడా తగ్గిస్తున్నారు. అందుకే ఆమె తెలుగులో సినిమాలను వద్దు అని కన్నడం లో తగ్గించడం లేదు అని అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: